• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • DADASAHEB PHALKE AWARD FOR RAJINIKANTH PM NARENDRA MODI CM KCR BEST WISHES TO RAJINIKANTH TA

Rajinikanth-PM Narendra Modi: రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

రజినీకాంత్ కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు (Twitter/Photo)

Rajinikanth-PM Narendra Modi | రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై రజినీకాంత్‌కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. తెలియజేసారు

  • Share this:
    Rajinikanth-PM Narendra Modi | రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై రజినీకాంత్‌కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. తెలియజేసారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.మన దేశంలో సినీ రంగంలో అత్యున్నత పురస్కారం.17వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు 1969లో ప్రారంభమైన ఈ అవార్డుల ప్రధానోత్సవం ఇప్పటి వరకు 50 మంది ఈ అత్యున్నత అవార్డు అందుకున్నారు. తాజాగా ఈ అవార్డును తమిళ చిత్ర సీమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తన కనుసైగలతో శాసించిన సూపర్ స్టార్ రజినీకాంత్‌ను వరించింది. త్వరలోనే కేంద్రం తలైవాకు ఈ అవార్డు ప్రధానం చేయనుంది. ఈ అవార్డు అందుకోబోతున్న 51వ వ్యక్తి.

    రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రముఖులు రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేసారు.


    మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ కూడా రజినీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసారు.


    మరోవైపు రజినీకాంత్ తోటి నటుడు రాజకీయ నాయకుడు మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తన సహోదరడు రజినీకాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడాన్ని స్వాగతించారు.

    ఇంకోవైపు డీఎంకే అధినేత ఎం.కె.  స్టాలిన్‌తో పాటు తమిళనాడు సీఎం పళని స్వామి, పన్నీర్ సెల్వం ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేసారు.





    తనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు తాను అర్హుడినిని కేంద్రం గుర్తించినందకు రజినీకాంత్ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ప్రకాష్ జవదేవకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.


    ఈ అవార్డును రజినీకాంత్‌కు కేంద్రం త్వరలోనే ప్రధానం చేయనున్నారు.
    .
    Published by:Kiran Kumar Thanjavur
    First published: