దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2019 : ఉత్తమ నటుడుగా మహేష్ బాబు..

దాదాసాహెబ్ ఫాల్కే  150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్  ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది.

news18-telugu
Updated: September 21, 2019, 11:56 AM IST
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2019 :  ఉత్తమ నటుడుగా మహేష్ బాబు..
Twitter/dpiff_south
  • Share this:
దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్బంగా దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ 2019 అవార్డ్స్  ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యాక్టర్స్, టెక్నిషన్స్ హాజరైయ్యారు. కాగా ఈ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందర రాజన్ హాజరై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ మెంట్‌లో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ  రోల్ గురించి ప్రసంగించారు. అది అలా ఉంటే మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో 2018లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ చిత్రానికి గానూ బెస్ట్ యాక్టర్‌గా మహేష్ బాబుకు అవార్డు దక్కింది.


ఈ అవార్డ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా మహేష్ బాబు సతీమణి నమ్రత అందుకున్నారు. మరో నటుడు మోహన్‌బాబుకు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.  అనుష్క శెట్టికి 'భాగమతి' సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. బెస్ట్ డైరెక్టర్‌గా 'రంగస్థలం' సినిమాకు సుకుమార్‌‌కు అవార్డ్ దక్కింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ఫిల్మ్ స్టార్స్ నటి మంచు లక్ష్మి, హీరోయిన్ అవికా గోర్‌, నటుడు సంపూర్ణేశ్‌బాబు, నటి ఆకాంక్ష సింగ్‌ తదితరులు హాజరైయారు.First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading