Home /News /movies /

DABBOO RATNANI HAS THIS TO SAY ABOUT HIS CALENDAR SHOOT WITH KIARA ADVANI BEING PLAGIARISED TA

నాగార్జున భామ కొబ్బరి ఆకు .. మహేష్ భామ అరిటాకు.. ఇంతకీ మేటరేమింటే..

కియారా న్యూడ్ ఫోటో షూట్ (Image: Kiara Advani/Twitter)

కియారా న్యూడ్ ఫోటో షూట్ (Image: Kiara Advani/Twitter)

రీసెంట్‌గా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా  కేవలం ఆకు చాటున దాగిన కియారా ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే కదా.

    రీసెంట్‌గా కియారా డబూ రత్నానీ నిర్వహించే ఫోటో షూట్‌లో ఒంటి మీద ఒక్క నూలు పోగు లేకుండా  కేవలం ఆకు చాటున (అరటి ఆకును పోలిన క్రోటన్ ఆకు) దాగిన కియారా ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నానీ ప్రతి యేడాది క్యాలెండర్‌ కోసం వివిధ హీరోయిన్స్‌తో ఫోటో డబూ ఫోటో షూట్ నిర్వహిస్తూ వస్తున్నాడు. కానీ 2020 క్యాలెండర్ కోసం కియారా పై చేసిన ఫోటో షూట్ మాత్రం టాక్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అయింది. ఈ ఫోటోలో కియారా ఒంటిపై బట్టలు లేకుండా.. కేవలం ఆకును మాత్రమే అడ్డుపెట్టుకున్న ఫోటో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేసారు. అంతేకాదు ఈ ఫోటోషూట్‌ను డబూ రత్నానీ.. స్టేఫ్ టైలర్ లుక్‌ను కాపీ కొట్టి కియారా లుక్‌ను కాపీ కొట్టారంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

    స్టేప్ టేలర్ లుక్‌లో కియారా ఫోటో షూట్ (Twitter/Photos)


    స్టేఫ్‌ టైలర్‌ లుక్‌ను తాను కాపీ కొట్టానంటూ వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా డబూ రత్నానీ ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ఒకప్పటి టబు లుక్‌ను స్ఫూర్తిగా తీసుకుని 2020 క్యాలెండర్‌ కోసం కియారాపై ఫొటోషూట్‌ తీసుకున్నానని ఆయన తెలిపారు. ఈమేరకు టబు లుక్‌కు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘2002లో నేను రూపొందించిన టబు లుక్‌ ఇది. ఎంతో అందమైన ఈ టబు లుక్‌ను 2001లో నా కెమెరాలో బంధించాను. ఈ లుక్‌నే 2002 క్యాలెండర్‌ కోసం ఉపయోగించాను. తాజాగా నేను రూపొందించిన క్యాలెండర్‌లోని కియారా లుక్‌ గురించి సోషల్‌మీడియాలో విపరీతంగా ట్రోల్స్‌, నేను వేరే వాళ్లని కాపీ కొట్టానంటూ వార్తలు వస్తున్నాయి. అందులో నిజం లేదు. నా కాన్సెప్ట్‌నే నేను మళ్లీ వాడాను’ అని వివరణ ఇచ్చారు.








    View this post on Instagram





    🍃🍀💚 Beautiful @tabutiful for #dabbooratnanicalendar 2002 ❤️📸🗓 #lovenature This timeless & mesmerising shot of Tabu was taken in the year 2001 and it featured in my calendar in the year 2002. There’s been a lil noise about @kiaraaliaadvani ‘s breathtaking 2020 calendar shot with leaf ☘️ ! Guess if I can reuse my camera, I can definitely repeat my own concept 🤓🤪✌🏼 ! & if at all that doesn’t go well with trolls, then I admit to plagiarising MY OWN SELF 😅😂🤣🤪 #loveandpeace @dabbooratnani @manishadratnani Huge Thanks to my friends who trust me 💯 ! That’s all that matters ❤️🧿 @dabbooratnanistudio #25yearsofdabbooratnani #dabbooratnani #tabu #kiaraadvani #dabbooratnanicalendar2002 #dabbooratnanicalendar2020 #naturelover #thenandnow Team Details : Makeup @ajayshelarmakepartist Hair @gohar__shaikh


    A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on






    కియారా విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ‘ఫగ్లీ’ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాత భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ‘ఎం.ఎస్.దోని’ జీవిత కథపై తెరకెక్కించిన ‘ఎం.ఎస్.దోని ది అన్‌టోల్డ్ కహాని’ సినిమాతో కథానాయికగా బ్రేక్ వచ్చింది. తెలుగులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఆ చిత్రం తర్వాత కియారా తన దృష్టిని కేవలం హిందీ సినిమాలకే పరిమితం చేసింది.గతేడాది షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘కబీర్ సింగ్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో జెండా పాతింది.  ఆ తర్వాత ఇయర్ ఎండింగ్‌లో అక్షయ్ కుమార్‌తో చేసిన ‘గుడ్ న్యూస్’తో మరో హిట్‌ను తన అకౌంట్‌లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వ రుస కమిట్‌మెంట్స్ ఇస్తూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది కియారా. అప్పట్లో ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌లో నటించింది. తాజాగా డబూ రత్నానీ ఫోటో షూట్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Bollywood, Dabboo Ratnani Calender, Kiara advani, Mahesh babu, Nagarjuna Akkineni, Tabu, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు