Balakrishna: బాలయ్య ఫోటోతో సైబరాబాద్ పోలీసుల ప్రచారం...

Balakrishna: నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి.. కాదని ఇంకేం పని చేసినా కూడా నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 5, 2020, 10:40 PM IST
Balakrishna: బాలయ్య ఫోటోతో సైబరాబాద్ పోలీసుల ప్రచారం...
బాలయ్య ఫోటోతో ప్రచారం (balakrishna)
  • Share this:
నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి.. కాదని ఇంకేం పని చేసినా కూడా నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు మరిచిపోవడం అంత సులభమా. అది ఇప్పటికీ రీ సౌండ్ వస్తూనే ఉంటుంది. అలాంటి డైలాగులు బాలయ్యకే సాధ్యం అంతే. ఇప్పుడు ఆ డైలాగులను పోలీసులు కూడా వాడేసుకుంటున్నారు. ప్రస్తుతం యాక్సిడెంట్స్ బాగా జరుగుతున్నాయి. కొందరు యువత ఈ ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
బాలయ్య ఫోటోతో ప్రచారం (balakrishna)
బాలయ్య ఫోటోతో ప్రచారం (balakrishna)


దీన్ని అరికట్టడానికి పోలీసులు తమవంతు అవేర్‌నెస్ కల్పిస్తున్నారు. స్పెషల్ క్లాసులు కూడా తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వీకెండ్స్‌లో మద్యం తాగి బండి నడిపి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ఫోటోను ప్రచారం కోసం వాడుకున్నారు సైబరాబాద్ పోలీసులు. దానికి బాలయ్య కూడా థ్యాంక్స్ చెప్పాడు. సోషల్ అవేర్‌నెస్‌లో భాగంగా తన ఫోటోను వాడుకున్నందుకు ఆయన కూడా సంతోషపడ్డాడు.

ఆదివారాలు, పండగ రోజులలో ఎక్కువ సంఖ్యలో డ్రంకన్ డ్రైవ్ ప్రమాదాలు జరుగుతున్నాయంటూ అందులో రాసి ఉంది. పండగలని, పబ్బాలని తాగి బండి నడిపితే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు అంటూ ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై బాలయ్య రియాక్ట్ కావడమే కాకుండా ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో తానెప్పుడు ఉత్సాహంగా పాల్గొంటానని చెప్పాడు. ప్రాణం పోయినా పర్లేదు కానీ మాట పోకూడదు అంటూ చివర్లో డైలాగ్ కూడా చెప్పాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: September 5, 2020, 10:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading