• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • CYBERABAD CYBER CRIME POLICE USED VICTORY VENKATESH EXPRESSIONS FOR AWARNESS VIDEO MNJ

Venkatesh: వెంకీ మామ‌ను వ‌ద‌ల‌ని సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.. ఏం చేశారో చూసేయండి

విక్టరీ వెంకటేష్ (Twitter/Photo)

Venkatesh: ఇంట‌ర్నెట్‌ని విరివిగా వాడుతున్న ఈ కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్ వాడ‌కం తెలియ‌ని వారే కాదు.. తెలిసిన వారు సైతం కొన్ని సార్లు మోస‌పోతున్నారు. గిఫ్ట్ వ‌చ్చింద‌ని, మీ పేరు మీద ల‌క్కీ డ్రా వ‌చ్చింద‌ని.. ఇలా క‌స్ట‌మ‌ర్‌కేర్ల పేరిట యూజ‌ర్ల‌కు కొంత‌మంది మోస‌గాళ్లు ఫోన్ చేయ‌డం.. అకౌంట్ల నుంచి డ‌బ్బుల‌ను కొట్టేయ‌డం చేస్తున్నారు

  • Share this:
    Venkatesh: ఇంట‌ర్నెట్‌ని విరివిగా వాడుతున్న ఈ కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆన్‌లైన్ వాడ‌కం తెలియ‌ని వారే కాదు.. తెలిసిన వారు సైతం కొన్ని సార్లు మోస‌పోతున్నారు. గిఫ్ట్ వ‌చ్చింద‌ని, మీ పేరు మీద ల‌క్కీ డ్రా వ‌చ్చింద‌ని.. ఇలా క‌స్ట‌మ‌ర్‌కేర్ల పేరిట యూజ‌ర్ల‌కు కొంత‌మంది మోస‌గాళ్లు ఫోన్ చేయ‌డం.. అకౌంట్ల నుంచి డ‌బ్బుల‌ను కొట్టేయ‌డం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అంద‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం ప్ర‌భుత్వాలు కూడా త‌మ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఇదిలా ఉంటే వీటిపై అవగాహ‌న క‌ల్పించేందుకు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు ఏ అవ‌కాశాన్ని వ‌ద‌ల‌ట్లేదు. కొంత‌మంది ప్ర‌ముఖుల‌తో వీటిపై అవ‌గాహ‌న వీడియోలు చేసి విడుద‌ల చేస్తున్నారు అలాగే ఈ త‌రానికి సినిమాలంటే చాలా మందికి ఇష్టం కాబ‌ట్టి.. సినిమాల్లోని మీమ్‌ల‌తో వారు అవేర్‌నెస్ క‌లిగిస్తున్నారు.

    ఈ క్ర‌మంలో ఆ మ‌ధ్య‌ హాస్య‌బ్ర‌హ్మ బ్ర‌హ్మానందంను రంగంలోకి దింపిన‌ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు.. ఆయ‌న చేత అవ‌గాహ‌న క‌లిగించారు. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్‌ని కూడా రంగంలోకి దింపారు. ఆయ‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఓ వీడియోను చేసి విడుద‌ల చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.



    అందులో పోలీస్ అధికారి.. మీరు ఈ-కామ‌ర్స్ సైట్‌లో షాపింగ్ చేశారా.. ల‌క్ష‌ల రూపాయ‌ల గిఫ్ట్ వ‌చ్చిన‌ట్లు మీకు ఫోన్ కాల్స్ గానీ మెసేజ్‌ గానీ లెట‌ర్ గానీ వ‌చ్చిందా.. అది న‌మ్మి కాంటాక్ట్ చేశారో ఈ డ‌బ్బులు గోవిందా.. ల‌క్ష‌ల విలువ చేసే గిఫ్ట్స్ ఎవ‌రైనా ఊరికే ఇస్తారా.. కాస్త ఆలోచించండి. గిఫ్ట్ వ‌చ్చాయంటూ కాల్స్, మెయిల్స్‌, మెసేజ్‌ల‌కు మీరు రెస్పాండ్ అవ్వకండి అని చెప్పారు. ఆ మ‌ధ్య మ‌ధ్య‌లో వెంకీ మామ నువ్వు నాకు న‌చ్చావులో ఎక్స్‌ప్రెష‌న్స్‌ని ఉప‌యోగించారు. ఈ వీడియో అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంటోంది.
    Published by:Manjula S
    First published: