హోమ్ /వార్తలు /సినిమా /

శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు.. కత్తి మహేష్ అరెస్ట్

శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు.. కత్తి మహేష్ అరెస్ట్

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి మహేష్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడు కానీ ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదు అంటూ కొందరు కుండ బద్దలు కొడుతున్నారు.

దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కత్తి మహేష్ అనారోగ్యం కారణంగానే చనిపోయాడు కానీ ఆయన మరణం వెనుక ఎలాంటి మిస్టరీ లేదు అంటూ కొందరు కుండ బద్దలు కొడుతున్నారు.

కొన్ని రోజుల క్రితం ఫేస్‌బుక్, ట్విటర్‌లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పలు చోట్ల కేసులు పెట్టాయి.

  టాలీవుడ్ వివాదాస్పద సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన కేసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. కాగా, కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్, ట్విటర్‌లో శ్రీరాముడి గురించి అసభ్యకర పోస్ట్‌లు పెట్టారు కత్తి మహేష్. ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన హిందూ సంఘాలు పలు చోట్ల కేసులు పెట్టాయి.

  వారి ఫిర్యాదుల ఆధారంగా సబైర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పలుమార్లు కత్తి మహేష్‌ను విచారించారు. ఇవాళ మరోసారి విచారించిన పోలీసులు.. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. కాగా, కొన్నేళ్లుగా కొత్తి మహేష్ వార్తల్లో ఉంటున్నారు. గతంలో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను టార్గెట్ చేశారు. అలా పవన్ ఫ్యాన్స్, కత్తి మహేష్ మధ్య కొన్ని నెలల పాటు మాటల యుద్ధం జరిగింది. ఆయనపై హైదరాబాద్‌లో ఓసారి దాడి కూడా జరిగింది.

  సినీ క్రిటిక్ కత్తి మహేష్ హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్టతో పాటు పలు సినిమాల్లో నటించారు. అంతేకాదు పెసరట్టు సినిమా డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొన్నారు. ఇటీవల ఆర్జీవీ డైరెక్ట్ చేసిన పవర్ స్టార్ సినిమాల్లోనూ నటించారు కత్తి మహేష్.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Kathi Mahesh, Telugu Movie, Telugu Movie News, Tollywood

  ఉత్తమ కథలు