హోమ్ /వార్తలు /సినిమా /

Viral Video : విజయ్ దేవర కొండ జట్టుతో ఓ ఆటాడుకున్న రష్మిక..వైరలవుతున్న త్రో బ్యాక్ వీడియో..

Viral Video : విజయ్ దేవర కొండ జట్టుతో ఓ ఆటాడుకున్న రష్మిక..వైరలవుతున్న త్రో బ్యాక్ వీడియో..

Photo Credit : You Tube

Photo Credit : You Tube

Viral Video : విజ‌య్‌-ర‌ష్మిక కెమెరా కంటి చిక్కిన‌ప్పుడ‌ల్లా వీరిద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్ షిప్ ను మించిన రిలేష‌న్ షిప్ ఏదో ఉంద‌ని పుకార్లు తెర‌పైకి రాగా..వాటిని ఈ ఇద్ద‌రు స్టార్లు కొట్టిపారేశారు.

  ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్‌ దేవరకొండ, రష్మిక. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియెన్స్‌ ఫిదా అయ్యారు. దీంతో ఈ క్యూట్‌ పెయిర్‌కు సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ కూడా ఉంది. ఇద్దరికి దాదాపు ఒకే సమయంలో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఒకనొక దశలో వీరిద్దరి మధ్య ప్రేమాయాణం నడుస్తుందనే పుకార్లు వచ్చినా తమ మధ్య ప్రేమ, దోమ ఏదీ లేదని, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరి మధ్య వచ్చే రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పడలేదు.ఇక డియర్‌ కామ్రేడ్ తర్వాత వీరిద్దరు ఇంత వరకు కలిసి నటించలేదు. దీంతో ఈ విజయ్‌-రష్మిక కాంబినేషన్‌ నుంచి మరో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.అయితే, లేటెస్ట్ గా విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక‌కు సంబంధించిన ఓ ఫ‌న్నీ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. 2019లో చెన్నైలో డియ‌ర్ కామ్రేడ్ ప్ర‌మోష‌న్స్ టైంలో విజ‌య్ ఓ ఇంట‌ర్వ్యూ కు హాజ‌ర‌వ్వాల్సి ఉంది.

  ఇందుకోసం విజ‌య్ హెయిర్ ను అత‌ని హెయిర్ స్టైలిష్ట్ సెట్ చేస్తుంటే అక్క‌డే ఉన్న ర‌ష్మిక..విజ‌య్ వెంట్రుక‌ల‌ను చెద‌ర‌గొట్టిన త్రోబ్యాక్ వీడియో ఒక‌టి నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. వీడియోలో బ్లాక్ డ్రెస్ లో ఉన్న ర‌ష్మిక స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తోంది. విజ‌య్‌-ర‌ష్మిక కెమెరా కంటి చిక్కిన‌ప్పుడ‌ల్లా వీరిద్ద‌రి మ‌ధ్య ఫ్రెండ్ షిప్ ను మించిన రిలేష‌న్ షిప్ ఏదో ఉంద‌ని పుకార్లు తెర‌పైకి రాగా..వాటిని ఈ ఇద్ద‌రు స్టార్లు కొట్టిపారేశారు.

  ఇక, సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక, రష్మిక చేతిలో చాలా సినిమాలు ఉన్నాయ్. అల్లు అర్జున్ మూవీ పుష్పలో హీరోయిన్ గా నటిస్తుండగా..ఆమె చేతిలో రెండు హిందీ సినిమాలు ఉన్నాయ్. ఈ మధ్య కాలంలో రష్మికకు బోలెడంత క్రేజ్ వచ్చింది. రష్మిక మంధాన ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Rashmika mandana, Tollywood news, Vijay Devarakonda, Viral Video

  ఉత్తమ కథలు