news18-telugu
Updated: December 24, 2019, 8:49 AM IST
షాలినీ పాండే (Image: shalini pandey/Instagram)
హీరోయిన్ షాలినీ పాండే గురించి మాట్లాడుకోవాలంటే ‘అర్జున్ రెడ్డి’కి ముందు.. ఆ తర్వాతే అనే చెప్పాలి. తాజాగా ఈ భామపై క్రిమినల్ కేసు నమెదు అయింది. ఈ సినిమా తర్వాత హీరో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో స్టేటస్ దక్కించుకున్నాడు. మరోవైపు షాలినీ పాండే అదే రేంజ్లో పాపులారిటీ రాకపోయినా ఓ మోస్తరు గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండతో షాలినీ పాండే చేసిన ముద్దు సన్నివేశాలు అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసాయి. ఆ సినిమా తర్వాత అడపదడపా కొన్ని సినిమాలు చేసినా...పూర్తి స్థాయి హీరోయిన్గా నటించింది మాత్రం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘118’. ఈ సినిమాతో మంచి విజయాన్నే అందుకుంది. ఈ మధ్యలో ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో అలరించింది. తాజాగా రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ ఈ వీకే విడుదల కానుంది. ప్రస్తుతం తెలుగు, తమిళం హిందీ భాషల్లో నటిస్తోంది.

రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే సినిమా
తాజాగా షాలినీ పాండే.. బాలీవుడ్ సినిమాలను చూసి తమిళ ఇండస్ట్రీని చిన్న చూపు చూస్తుందనే వివర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా షాలీనీ పాండే పై తమిళ నిర్మాత ఒకాయన క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న ‘అగ్ని సిరాగుగుల్’ సినిమాలో నటిస్తానని సైన్ చేసింది షాలినీ పాండే. ఒక షెడ్యూల్లో కూడా యాక్ట్ చేసిన తర్వాత ఈ సినిమాషూటింగ్కు రావడం మానేసిందంట. షూటింగ్‌కు ఎందుకు రావడం లేదంటే బాలీవుడ్లో ఆఫర్లు వస్తున్నందుకు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపడం లేదని తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రొడక్షన్ వాళ్లు ఈ విషయమై తెలుగు, తమిళ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు.. షాలినీ పాండే పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం షాలినీ పాండే.. రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ ఆఫర్ రావడంతో షాలినీ పాండే తమిళ సినిమాకు హ్యాండ్ ఇచ్చింది. షాలినీ పై హ్యాండ్ ఇవ్వడంతో చేసేది లేక చిత్ర నిర్మాతలు ఇపుడు విజయ్ ఆంటోని ‘అగ్ని సిరాగుగల్’లో ఆమె ప్లేస్‌లో అక్షరా హాసన్‌ను తీసుకున్నారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 24, 2019, 8:49 AM IST