హోమ్ /వార్తలు /సినిమా /

Jaan Say: క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'జాన్ సే'.. నయా డైరెక్టర్ డిఫరెంట్ స్టోరీ

Jaan Say: క్రైమ్ థ్రిల్లర్‌గా రాబోతున్న 'జాన్ సే'.. నయా డైరెక్టర్ డిఫరెంట్ స్టోరీ

Jaan Say (Photo News 18)

Jaan Say (Photo News 18)

Jaan Say Release date: కొత్త కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వెతుకుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో నూతన దర్శకుడు కిరణ్ కుమార్ 'జాన్ సే' అంటూ ఓ వైవిధ్యభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌ రూపొందిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ మధ్యకాలంలో ఆడియన్స్ టేస్ట్ మారుతోంది. నటీనటులు, దర్శకనిర్మాతలతో పనిలేకుండా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలనే ఆదరిస్తున్నారు జనం. దీంతో కొత్త కొత్త దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్స్ వెతుకుతూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్లాన్ చేస్తున్నారు. అదే బాటలో నూతన దర్శకుడు కిరణ్ కుమార్ (Kiran Kumar) 'జాన్ సే' (Jaan Say) అంటూ ఓ వైవిధ్యభరితమైన క్రైమ్ థ్రిల్లర్‌ రూపొందిస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఒక కొత్త ఫేజ్ లో ఉంది. కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీగా రూపొందుతున్న సినిమాలే సక్సెస్ బాట పడుతున్నాయి. సినిమా పట్ల నిబద్దతతో ఫ్రెష్ సబ్జెక్ట్స్ తో వస్తున్న కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని కేవలం సినిమా మీద ప్యాషన్ తో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు ఎస్. కిరణ్ కుమార్. కృతి ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ No 1 గా 'జాన్ సే' టైటిల్ తో కిరణ్ కుమార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం లో రూపొందిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న జాన్ సేలో యువ జంట అంకిత్, తన్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థ్రిల్లింగ్ అంశాలతో పాటు లవ్ స్టొరీ కూడా కీ రోల్ ప్లే చేసే ఈ చిత్రం దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరు వరకు జరిగే షెడ్యుల్ తో పూర్తి షూటింగ్ పూర్తవుతుంది. ఇందులో హీరోగా నటిస్తున్న అంకిత్ ఇంతకముందు జోహార్, తిమ్మరుసు వంటి చిత్రాల్లో నటించగా, హీరోయిన్ తన్వి ఐరావతం సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అప్ కమింగ్ హీరో హీరోయిన్లతో, రూ 10 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రముఖ సీనియర్ యాక్టర్లతో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా లావిష్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ జాన్ సే చిత్రానికి సచిన్ కమల్ సంగీతాన్ని అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసి విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో అంకిత్, తన్వి, సుమన్, అజయ్, తనికెళ్ళ భరణి, సూర్య, భాస్కర్, రవి వర్మ, అయేషా, రవి శంకర్, లీల, బెనర్జీ, రవి గణేష్, రమణి చౌదరి, వంశీ, అంజలి, కిరణ్ కుమార్, ఏ కే శ్రీదేవి, ప్రశాంత్ సమలం, వేణుగోపాల్, తేజ, సంతోష్, వి జే లక్కీ, శ్రీను, అరుణ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

First published:

Tags: Cinema, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు