నిధి అగర్వాల్ సహా ముగ్గురు భామలతో లవ్ ఎఫైర్ నడిపిన భారత క్రికెటర్..

భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఈ క్రికెటర్ మాత్రం అర డజను భామలతో లవ్ ఎఫైర్ నడిపి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 22, 2019, 3:17 PM IST
నిధి అగర్వాల్ సహా ముగ్గురు భామలతో లవ్ ఎఫైర్ నడిపిన భారత క్రికెటర్..
నిధి అగర్వాల్ (Instagram/Photo)
  • Share this:
భారత క్రికెటర్లు.. హీరోయిన్స్‌తో ఎఫైర్లు నడపడం అన్నది ఎప్పటి నుంచో ఉంది. అప్పటి భారత క్రికెట్ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి వలచి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు మైదానంలో చూపులు కలిసి తర్వాతే మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. ఇప్పటికే టీమ్ ఇండియా క్రికెటర్ జస్ప్రిత్ బుమ్రా..మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌తో పీకలోతు ప్రేమలో మునిగిపోయినట్టు సినీ,క్రికెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే భారత యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్ క్రికెటర్‌గానే కాకుండా రొమాంటిక్ లవర్‌గా వార్తల్లో పతాక శీర్షికల్లో నిలుస్తున్నాడు. అతడి ప్రేమాయణంలో పెద్ద జాబితానే ఉంది మరి. మోడల్ ఎలిక్సర్‌ నహర్‌, కథానాయికలు సోనమ్‌ బజ్వా, ఆథియా శెట్టి, నిధి అగర్వాల్‌తో వేర్వేరు సందర్భాల్లో ప్రేమలో మునిగినట్లు తెలుస్తోంది. . ఇటీవల ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ అనే అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అఫైర్ల గురించి వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చాడు ఈ క్రికెటర్.

cricket, Asia cup, Ind vs Pak, India Vs Pakistan 2018, #INDvAFG, Asia cup 2018, Rohit sharma, dhoni, రోహిత్ శర్మ, ఆసియా కప్ 2018, ఇండియా - పాక్ మ్యాచ్, dhoni captain, Ind vs AFG, Afghanistan, రోహిత్ శర్మ , KL rahul, Rahul gym
క్రికెటర్ కే.ఎల్.రాహుల్ (ఫైల్ ఫోటో)


ఈ ఇంటర్వ్యూ లో హీరోయిన్లతో అఫైర్ల గురించి మీ వివరణ ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మీడియాలో వచ్చిన కథనాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. పలువురితో నా రిలేషన్‌షిప్స్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయా? నా రిలేషన్‌షిప్స్ గురించి ఏం రాశారు అంటూ అంటూ కేఎల్ రాహుల్ ఎదురు ప్రశ్నలు వేశారు.ప్రస్తుతానికి నేను క్రికెట్‌ను మాత్రమే ప్రేమిస్తున్నాను. క్రికెట్ తప్ప మరోటి నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ప్రేమలో పడితే నేను ముందుగా అందరికీ ఆ విషయాన్ని షేర్ చేస్తానన్నాడు. అప్పుడు మీడియాను పిలిచి బహిరంగంగా నా అఫైర్ గురుంచి షేర్ చేసుకొంటాను అని కేఎల్ రాహుల్ తెలిపారు. ఇదిలావుంటే ఇంతకూ ఈ స్ట్రోక్‌ ప్లేయర్‌ హృదయాన్ని ఎవరెవరు గెలుచుకున్నారో ఒక లుక్ వేద్దామా ..

నిధి అగర్వాల్ :నిధి అగర్వాల్‌తో క్రికెటర్ కే.ఎల్.రాహుల్ (Youtube/Photo)


‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఇక ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంలో హాట్‌హాట్‌గా నటించి కుర్రాళ్ల మనసును దోచేసింది. ప్రస్తుతం ‘మాస్క్’ అనే హిందీ సినిమాలో నటిస్తోంది. రాహుల్‌తో నిధి డేటింగ్‌ చేసిందని గతంలో వార్తలు వినిపించాయి. కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యాయి.

సోనమ్ బజ్వా :
సోనమ్ బాజ్వాతో క్రికెటర్ కే.ఎల్.రాముల్ (youtube/Photo)


విక్టరీ వెంకటేశ్‌ నటించిన ‘బాబు బంగారం’ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించి ఊపు ఊపేసిన ఈ సుందరి. పంజాబీ, హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ‘పంజాబీ 1984’లో చక్కని అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది.మోడలింగ్ తోనూ మెరిసిన సోనమ్ కు రాహుల్‌తో అనుబంధం ఎలా మొదలైందో తెలీదుగానీ కొన్నాళ్లు వీరిద్దరూ చెట్టాపట్టాల్‌ వేసుకున్నారు.

ఆథియా శెట్టి :

అతియా శెట్టితో కే.ఎల్.రాహుల్ (Youtube/Photo)


అతియా శెట్టి..ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి ముద్దుల కూతురు. ‘హీరో’ చిత్రంతో అందరికీ పరిచయమైన అథియా. ఆ తర్వాత ‘ముబారక్’ సినిమాలో మురిపించింది. ‘నవాబ్‌ జాదే’లో అతిథిగా అలరించింది.స్ట్రోక్‌ప్లేయర్‌ రాహుల్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం కొనసాగించిందని గుసగుసలు అప్పట్లో సంచలనాన్ని రేకెత్తించాయి.

ఎలిక్సిర్‌ నహర్‌:

ఎలిక్సిర్‌ నహర్‌తో క్రికెటర్ కే.ఎల్.రాహుల్ (twitter/Photo)


యాంకర్‌, మోడల్, మార్కెటింగ్‌ అసోసియేట్‌గా పేరుతెచ్చుకున్న నహర్‌ స్వస్థలం బెంగళూరు.భారత్‌ తరఫున రాహుల్‌ ఆడుతున్నప్పుడు అతడి కోసం స్టేడియానికి వచ్చింది. ప్రస్తుతం ఆమె కేపీఎల్‌ టీవీ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ ముద్దుగుమ్మ ఎంతో చురుకు. వీరిద్దరు కలిసి షికారుకు వెళ్లినప్పుడు కెమెరా కంటికి ఎన్నో సార్లు చిక్కారు.

ఆకాంక్ష:

ఆకాంక్షతో క్రికెటర్ కే.ఎల్.రాహుల్ (Youtube/Photo)


పంజాబీ మోడల్, నటి ఆకాంక్ష రంజన్‌ కపూర్‌తో కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. వీరిద్దరు కలిసి చనువుగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ స్నేహితురాలుగా ఆకాంక్షకు నెట్టింట్లో మంచి క్రేజ్‌ ఉంది. ఆలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌కు రాహుల్‌ను ఆమె స్వయంగా పరిచయం చేయడంతో ప్రేమ వార్తలకు రెక్కలొచ్చాయి. ఇంతకూ ఆకాంక్షను ప్రేమిస్తున్నారా అని అడిగితే విరగబడి నవ్విన రాహుల్‌ .. నాకేం తెలియదని చెప్పడం కొసమెరుపు.
First published: August 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు