Bucchibabu - Uppena: ‘ఉప్పెన’ డైరెక్టర్ నెక్ట్స్ మూవీపై క్రేజీ అప్ డేట్

Crazy update on Uppena director Bucchibabu next movie details here

Bucchibabu - Uppena: తొలి చిత్రం ‘ఉప్పెన’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబు సానా నెక్ట్స్ మూవీని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నాడట.

  • Share this:
    సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకోవడం చాలా కష్టం. ఒకసారి గుర్తింపు వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆ మజాను ఎంజాయ్‌ చేస్తున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌ టీమ్‌లో పనిచేసిన బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం 'ఉప్పెన'. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ను సాధించింది. దీంతో చాలా మంది నిర్మాత‌లు బుచ్చిబాబు సానాతో సినిమాను తెర‌కెక్కించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. అయితే ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మాత్రం త‌న త‌దుప‌రి చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌లోనే చేయబోతున్నాడ‌ట‌.

    తొలి చిత్రం ఉప్పెన‌ను ఉత్త‌రాంధ్ర నేప‌థ్యంలో సాగే ప్రేమ‌క‌థా చిత్రంగా మ‌లిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి భిన్నంగా బుచ్చిబాబు నెక్ట్స్ మూవీని తెర‌కెక్కిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. సినీ వ‌ర్గాల స‌మాచారం. ఉత్త‌రాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఓ స్టార్ హీరోతో చర్చలు జరుపుతున్నారని న్యూస్ హల్ చల్ చేస్తుంది.

    ఉప్పెన సినిమా క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే 41 కోట్ల రూపాయ‌ల నెట్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమా త్వ‌ర‌లోనే యాబై కోట్ల మార్కును రీచ్ అవుతుంది. డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
    Published by:Anil
    First published: