Home /News /movies /

CRAZY UPDATE FROM BALAKRISHNA GOPICHAND MALINENI NBK107 SLB

NBK107: ఇదే జరిగితే నందమూరి అభిమానులకు పూనకాలే..

Photo Twitter

Photo Twitter

Balakrishna Gopichand Malineni: మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) కమిటైన బాలయ్య బాబు.. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ మాస్ మసాలా ఈ మూవీ సిద్ధమవుతోంది.

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన ‘అఖండ’ (Akhanda) మూవీ సూపర్ సక్సెస్‌ సాధించి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో అదే ఊపులో మరో మాస్ సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) కమిటైన బాలయ్య బాబు.. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ చకచకా కంప్లీట్ చేస్తున్నారు. ఓ పవర్ ఫుల్ మాస్ మసాలా ఈ మూవీ సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఫారిన్ ఫైట్ హైలైట్ కాబోతోందని తెలుస్తోంది.

మాస్ అంశాలు పుష్కలంగా ఉండేలా ఈ సినిమా కథ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఈ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఖర్చు విషయంలో మైత్రి మేకర్స్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదని సమాచారం. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవాలని భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్ సీన్స్ హైలైట్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నారట గోపీచంద్ మలినేని. ఫస్టాఫ్‌లో వచ్చే ఫారిన్ ఫైట్ సినిమాకే హైలైట్ అవుతుందని, అంతేకాదు ఈ ఫైట్ సీన్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు.

అదేవిధంగా సెకండాఫ్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా బాలకృష్ణ గత సినిమాల్లో చూడని విధంగా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో శృతిహాసన్ (Shruthi haasan)హీరోయిన్‌గా నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే పేరు ఖరారు చేశారని, త్వరలోనే అధికారికంగా కన్ఫర్మేషన్ రానుందని అంటున్నారు. ఈ టైటిల్ విని నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కేక పెట్టించనున్నారని సమాచారం. అలాగే ఓ మాస్ ఐటెం సాంగ్ ప్లాన్ చేసిన యూనిట్.. ఇందుకోసం డింపుల్ హయతిని ఎంపిక చేసుకున్నారని టాక్. సింహం వేటకు సిద్ధం.. అని పేర్కొంటూ రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Balakrishna, Nandamuri balakrishna, NBK 107

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు