త్రివిక్రమ్ (Trivikram) సినిమా అంటేనే 'అ' సెంటిమెంట్ రిపీట్ అవుతూ ఉండటం, లెంగ్తీ టైటిల్స్ కనిపిస్తుండటం కామన్. ఓ డిఫరెంట్ వే లో ఆయన సినిమా టైటిల్ పెడుతుంటారు. మొదట కాస్త ఎబ్బెట్టుగా అనిపించినా సినిమా రిలీజ్ తర్వాత అదే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) ఆయన రూపొందించనున్న కొత్త సినిమాకు ఓ లెంగ్తీ టైటిల్ పరిశీలనలో పెట్టారట. పైగా ఈ టైటిల్ గతంలో వచ్చిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) కోసం ముందుగా అనుకుందని, అప్పుడు కుదరకపోవడంతో ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు దాన్నే వాడేయాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి ఇంతకీ ఆ టైటిల్ ఏంటి? మహేష్- త్రివిక్రమ్ కాంబోకి ఎలాంటి పేరు పెట్టబోతున్నారు? అనే దానిపై ఓ లుక్కేద్దామా..
ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న మహేష్ బాబు అదే జోష్‌లో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ఇప్పటికే కంప్లీట్ చేసి పక్కా స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్న త్రివిక్రమ్ మహేష్ బాబు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు కూడా. అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ చిత్రానికి అర్జునుడు అనే పేరు ఫిక్స్ చేశారని టాక్ బయటకు రాగా.. తాజాగా అది కాదు మరొకటి అంటూ ఫిలిం నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సెంటిమెంట్ ఫాలో అయ్యే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం 'అసుర సంధ్య వేళలో..' అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. ఈ టైటిల్‌ని త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన భీమ్లా నాయక్ కోసం అనుకున్నారట. కానీ పవన్ ఆ టైటిల్‌పై ఆసక్తి చూపకపోవడంతో పెట్టలేదని టాక్. ఇప్పుడు అదే టైటిల్ మహేష్‌తో చేస్తున్న సినిమాకు తీసుకోవాలని త్రివిక్రమ్ చూస్తున్నారట. అ సెంటిమెంట్‌కి తోడు లెంగ్తీ ఫార్మాట్‌లో ఉంది కాబట్టి దీనిపై మక్కువ చూపుతున్నారట ఈ మాటల మాంత్రికుడు.
మహేష్ బాబు కెరీర్‌లో 28వ సినిమాగా గ్రాండ్‌గా ఈ సినిమా రూపొందనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాతగా వ్యవహరించనున్నారు. తమన్ బాణీలు కడుతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. గతంలో త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ప్రేక్షకాదరణ పొందటంతో మళ్ళీ అదే కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh Babu, Pooja Hegde, Trivikram Srinivas, త్రివిక్రమ్, మహేష్ బాబు