స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కోవిడ్ బారిన పడింది. తాను కోలుకుంటున్నానని, ఈ మధ్య తనను కలిసిన వారందరినీ కరోనా టెస్టులు చేయించుకోవాలంది రకుల్ ప్రీత్ సింగ్. అసలు రకుల్ పాపకు ఏమైందోనని అభిమానులు టెన్షన్ పడుతుంటే.. రకుల్ మాత్రం అస్సలు టెన్షన్ పడటం లేదు. తను 16 మార్క్‌ని చేరుకున్నానని అంది. అదేంటి? రకుల్‌కి పదహారేంటి? అని అనుకోకండి అసలు విషయం ఏంటంటే ఇన్‌స్టాలో రకుల్ ప్రీత్ సింగ్ 16 మిలియన్ ఫాలోవర్స్‌ను రీచ్ అయ్యింది. ఈ విషయాన్ని రకుల్ చిన్న పాటి వీడియో ప్రోమోతో తెలియజేసింది. ‘‘కేవలం థాంక్స్ చెబితేసరిపోదు. ప్రతిరోజూ నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. మిమ్మల్ని డిసప్పాయింట్ కూడా చేయను.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.
కోవిడ్ సమయంలో షూటింగ్స్‌కి అనుమతులు ఇచ్చినప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. అలాగే సామ్‌జామ్ షోతో హల్చల్ చేసిన రకుల్ ఫిట్నెస్ ఫొటోలు, వీడియోలను నెట్టింట హల్చల్ చేస్తుంది రకుల్. ప్రస్తుతం తెలుగులో నితిన్ చెక్ సినిమాలోనూ రకుల్ లాయర్ పాత్రలో నటించింది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇది కాకుండా తమిళంలో, హిందీలోనూ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. షూటింగ్స్‌లో పాల్గొంటున్న సమయంలో కోవిడ్ సోకడంతో మరో రెండు, మూడు వారాలు బ్రేక్ పడ్డట్లు అయ్యింది.
రీసెంట్గా ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో సరదాగా గడిపిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ మధ్యన డ్రగ్స్ కేసులో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తనపై తప్పుడు వార్తలను మీడియా ప్రచారం చేస్తోందంటూ రకుల్ కేసు కూడా వేసిన సంగతి తెలిసిందే. కోర్టు కూడా రకుల్‌కు మద్దతుగానే మాట్లాడింది.