Telangana 5 Shows: తెలంగాణలో 5 షోలకు అనుమతి.. మరి ఏపీలో ఏంటి థియేటర్ల పరిస్థితి..?

Telangana theaters

Telangana 5 Shows: రెండు సంవత్సరాల నుండి దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పటికీ ప్రజల ప్రాణాలతో ఆడుతూనే ఉంది. ఎన్నో రకాలుగా దేశం మొత్తం నష్టపోగా.. తిరిగి కోలుకునే సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ తో దేశాన్ని వణికించింది.

  • Share this:
    Telangana 5 Shows: రెండు సంవత్సరాల నుండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కరోనా వైరస్ కారణంగా ఇప్పటికీ ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయ్. ఎన్నో రకాలుగా దేశం మొత్తం నష్టపోగా.. తిరిగి కోలుకునే సమయంలో మళ్లీ సెకండ్ వేవ్‌తో దేశాన్ని వణికించింది. ఇక అన్నీ నష్టపోగా సినీ ఇండస్ట్రీకి కూడా తీవ్రమైన నష్టం వచ్చింది. కరోనా కేసులు కాస్త పెరిగిన మొదటి నుంచే థియేటర్లు బంద్ చెయ్యడంతో ఏ ఇండస్ట్రీకి లేని నష్టం సినీ ఇండస్ట్రీకి వచ్చింది. దీంతో థియేటర్ లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వాల్సిన ఎన్నో సినిమాలు ఓటీటీలో విడుదలై రికార్డులు బద్దలు కొట్టాయ్. అయితే కరోనా ప్రభావం ప్రస్తుతం కాస్త తగ్గడంతో థియేటర్లు తెరుచుకున్నాయ్. థియేటర్లు తెరుచుకున్న సినీ ఇండస్ట్రీకి మాత్రం నష్టాలు లేక తప్పలేదు. రోజుకు మూడు షోలు మాత్రమే ఇవ్వడం, ప్రతి షోకు 50% మాత్రమే ఆక్యుపెన్సీ ఇవ్వడం వల్ల థియేటర్లలో భారీగా నష్టాలు ఉంటున్నాయ్. ఇక ఈమేరకే త్వరలోనే తెలంగాణాలో ఐదు షోలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం.

    థియేటర్లకు తిరిగి అనుమతి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీంతో థియేటర్ లో రోజుకు 5 ఆటలు ఆడించాలని చర్చలు జరుగుతున్నాయ్. ఇక ఈ విషయం గురించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎగ్జిబీటర్ల సమావేశంలో చర్చలు జరిపారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మూడు షో లు మాత్రమే నడుస్తున్నాయి. కానీ సెకండ్ షోకు మాత్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. మొత్తానికి తెలంగాణలో ఐదు షోలను నడిపేలా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

    ఇక ఇప్పటికే పలు సినిమాలు విడుదల చేసిన కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కరోనా నిబంధనల కారణంగా కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడింది. వకీల్ సాబ్ సినిమా కూడా టికెట్ రేట్ తగ్గించడం, నైట్ షోస్ తీసెయ్యడం కారణంగా భారీగా నష్టపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ఎస్ ఆర్ కల్యాణమండపం కూడా ఆంధ్ర ప్రదేశ్ లో నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లపై చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా ఇంకా ఓపెన్ చేయలేదని సమాచారం.

    ఇక ఈ ఏడాది వైరస్ ప్రభావం మళ్లీ ఎలా ఉంటుందో అర్ధం కాకపోగా.. ఈ ఏడాది మాత్రం వరుసగా స్టార్ హీరోల సినిమాలు, పాన్ ఇండియా మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో నిర్మాతలకు ఈ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలా లేదా ఓటీటీపై ఆశలు పెట్టుకోవాలా అర్థం కాని పరిస్థితిగా మారింది. ఈ ఏడాది సినీ ఇండస్ట్రీ మంచి లాభాలు అందుకుంటుందో లేక ఇలానే నష్టపోతుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: