ఏం ఖర్మరా దేవుడా.. చచ్చిపోతే పరామర్శించలేని విషాదం..

అదేం పరీక్షో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఈ మధ్యే వరస విషాదాలు జరుగతున్నాయి. దాంతో వాళ్లను కడసారి చూడ్డానికి కూడా ఎవరూ రావద్దంటూ కుటుంబ సభ్యులే చెప్పడం విషాదంలో మరింత విషాదం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 8, 2020, 3:17 PM IST
ఏం ఖర్మరా దేవుడా.. చచ్చిపోతే పరామర్శించలేని విషాదం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కారణంగా మనుషులు దూరమైపోతున్నారు. ఇప్పట్లో ఈ మహమ్మారి దూరమవుతుందో లేదో తెలియదు కానీ మనుషులకు మనుషులు అయితే దూరం అయిపోతున్నారు. ఎంతగా అంటే చనిపోతే కనీసం ఇంటికి వెళ్లి బంధువులకు ధైర్యం చెప్పలేనంతగా.. కనీసం శవాన్ని చివరి చూపు కూడా చూడలేనంతగా.. అంతగా ఇప్పుడు కరోనా మహమ్మారి మనుషులను దూరం చేస్తుంది. ముఖ్యంగా అదేం పరీక్షో తెలియదు కానీ ఇండస్ట్రీలో ఈ మధ్యే వరస విషాదాలు జరుగతున్నాయి. దాంతో వాళ్లను కడసారి చూడ్డానికి కూడా ఎవరూ రావద్దంటూ కుటుంబ సభ్యులే చెప్పడం విషాదంలో మరింత విషాదం.

శ్రీలక్ష్మి కనకాల మృతి (Facebook/Photo)
శ్రీలక్ష్మి కనకాల మృతి (Facebook/Photo)


మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్ధుల్లా ఖాన్ చనిపోతే మేనమామ కూడా కరోనా కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఇక తెలుగులో రాజీవ్ కనకాల చెల్లెలు, సుమ ఆడపడుచు శ్రీలక్ష్మి చనిపోతే కూడా ఎవరూ రావద్దని కోరాడు రాజీవ్. గతేడాది తండ్రిని కోల్పోయిన ఈయన ఇప్పుడు చెల్లిని కూడా కోల్పోయాడు. దానికి ముందు ఏడాది తల్లి చనిపోయింది. గత కొద్దికాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీలక్ష్మి ఏప్రిల్ 6న చనిపోయింది. ఇక దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కూడా తాజాగా మరణిస్తే తన ఇంటికి ఎవరూ రావద్దని ఆయనే కోరుకున్నాడు.

చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/Photo)
చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్ (Twitter/Photo)
చాలా మంది ప్రముఖులు ఈ రెండు కుటుంబాలను ఫోన్‌లోనే పరామర్శించాల్సిన దుస్థితి వచ్చింది. స్వయంగా వాళ్లే రావద్దని చెప్పారు. బయట పరిస్థితులు దారుణంగా ఉండటంతో వాళ్ల అంత్యక్రియలు కూడా ఎలాంటి సందడి లేకుండా జరిగాయి. ఇదిలా ఉంటే కన్నడలో కూడా బుల్లెట్ ప్రకాశ్ లాంటి స్టార్ కమెడియన్ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా ఏ స్టార్ రాలేదు. దానికి కారణం కరోనా. కన్నడలో ఈయన 325 సినిమాలకు పైగా నటించాడంటే ఎంత పెద్ద కమెడియన్ అనేది అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ కమెడియన్ కన్నుమూత (Twitter/Photo)
ప్రముఖ కమెడియన్ కన్నుమూత (Twitter/Photo)


అలాంటి మనిషి చనిపోతే 24 గంటలు కూడా గడవకముందే ఖననం చేసారు. అలాంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. చచ్చిపోతే కనీసం కడసారి కూడా చూసుకోలేని నీచమైన పరిస్థితిని సృష్టించావేంటి దేవుడా అంటూ అంతా ఆయన్ని కూడా తిట్టుకుంటున్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదంటున్నారు. కష్టం వచ్చినపుడు కనీసం తోడుగా కూడా లేకుండా చేసావు కదయ్యా అంటూ నిందిస్తున్నారు. మొత్తానికి ఏదేమైనా కూడా కరోనా కారణంగా మరణం కూడా ఒంటరి అయిపోతుంది.
First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading