Home /News /movies /

COVID 19 ATTACK ON TELEVISION ACTORS AND THEY SAYS CANT WORK ANYMORE PK

బుల్లితెరను వేగంగా కమ్మేస్తున్న కరోనా.. నటుల్లో ఆందోళన..

(Telugu serials)

(Telugu serials)

Serial shootings: క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా ఇండ‌స్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు.

క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త మూడు నెల‌లుగా ఇండ‌స్ట్రీతో పాటు టీవీ రంగం కూడా మూత పడిపోయింది. ఎలాంటి షూటింగ్‌లు లేకుండా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. లాక్‌డౌన్ దెబ్బ‌తో కోట్లాది రూపాయలు నష్ట్టం వచ్చింది కూడా. ప‌ని లేక‌ పాపం చాలా మంది సినీ కార్మికులు, క‌ళాకారులు పూట గడవని పరిస్థితికి వచ్చారు. అలాంటి వాళ్లందరికీ తీపి కబురు చెప్తూ ఈ మధ్యే మళ్లీ షూటింగ్స్ చేసుకోండి అంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గత వారం రోజులుగా అన్నిచోట్లా కూడా సీరియల్ షూటింగ్స్‌తో పాటు రియాలిటీ షోలు కూడా బాగానే జరుగుతున్నాయి.

ఆర్ఎఫ్‌సీలో మొదలైన షూటింగ్ సందడి (serial shooting in rfc)
ఆర్ఎఫ్‌సీలో మొదలైన షూటింగ్ సందడి (serial shooting in rfc)


కోవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారమే ఆర్ఎఫ్‌సీతో పాటు హైదరాబాద్‌లోని పలు స్టూడియోస్‌లో ఈ సీరియల్ షూటింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఓ సీరియ‌ల్‌లో నటిస్తున్న ప్ర‌భాక‌ర్ అనే వ్య‌క్తికి సెట్‌లోకి వెళ్లాక క‌రోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోయారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా సీరియల్ నటుడికి రావడంతో మళ్లీ షూటింగ్స్ అన్నీ క్లోజ్ చేసారు. ఇప్పుడు మాటీవీలో వచ్చే గృహలక్ష్మీ సీరియల్ నటుడికి కూడా కరోనా వచ్చింది. దాంతో అప్పటికప్పుడు సెట్ శానిటైజ్ చేసి మొత్తం ఆపేసారు.

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter
ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter


ఇవి పైకి కనిపించిన రెండు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే. ఇంకా చాలా మందికి కరోనా వచ్చిందని ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే వాళ్లు కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లంతా టెస్టులు చేయించుకుని రిజల్ట్స్ కోసం చూస్తున్నారు.  ఇప్పటికే తమిళనాడులో సీరియల్ షూటింగ్స్ ఆపేయాలంటూ ఆజ్ఞలు వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇదే జరగబోతుందేమో అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్స్ అంటే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకోవడమే అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా కరోనా మాత్రం వదిలేలా కనిపించడం లేదు.

షూటింగ్స్‌కు మరోసారి బ్రేకులు (Shootings break in Tamil Nadu)
షూటింగ్స్‌కు మరోసారి బ్రేకులు (Shootings break in Tamil Nadu)


ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ కోవిడ్ 19ను ఆపడం అంత ఈజీ కాదని అర్థమైపోయింది. అందుకే మళ్ళీ షూటింగ్స్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు సినిమా షూటింగ్స్ అయితే జరగడం లేదు. హీరోలు ఇప్పట్లో బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. మొత్తానికి కరోనా విళయ తాండవం ఇలాగే సాగితే పరిస్థితులు రానురాను ఎలా ఉంటాయో ఊహించుకోడానికి కూడా భయంగానే ఉంది.
First published:

Tags: Coronavirus, Telugu Cinema, Telugu tv serials, Tollywood

తదుపరి వార్తలు