లాక్ డౌన్ ఎఫెక్ట్... టీవీ సీరియల్స్‌లో నటించే అన్నా చెల్లెళ్లు ఆత్మహత్య...

టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.

news18-telugu
Updated: June 6, 2020, 9:02 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్... టీవీ సీరియల్స్‌లో నటించే అన్నా చెల్లెళ్లు ఆత్మహత్య...
రాష్ట్రంలోని తౌబాల్ జిల్లా కొంజం సపం గ్రామానికి చెందిన బాధితుడు బీపీ, కిడ్నీ సమస్యల కారణంగా మే 22న ఆ వ్యక్తి రిమ్స్‌లో చేరాడు.
  • Share this:
టీవీ సీరియల్స్‌లో నటించే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. వారు నివసిస్తున్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి డోర్ పగలగొట్టి చూడగా, అందులో అన్నాచెల్లెళ్ల మృతదేహాలు కనిపించాయి. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు ఆత్మహత్య చేసుకుని కొన్ని రోజులు అయి ఉంటుందని భావిస్తున్నారు. కొన్ని తమిళ సీరియల్స్‌లో నటించే శ్రీధర్, అతడి సోదరి జయ కళ్యాణి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి దొరకలేదని, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. చెన్నైలోని కొడంగయ్యూర్‌లో ఉన్న వారి ఇంట్లో కుళ్లిన దశలో వారి శవాలు కనిపించాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరు హిందీ టీవీ ఆర్టిస్టులు కూడా ఇలాగే ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: June 6, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading