టాలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్.. 1000 కోట్లకు పైగానే నష్టాలు..?

COVID-19: నెల రోజుల కింద కరోనా తెలంగాణకు వస్తుందా అంటే ఆ.. ఏమొస్తుందిలే అన్నారు. ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. అందులోనూ తెలంగాణకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 5:11 PM IST
టాలీవుడ్‌లో టెన్షన్ టెన్షన్.. 1000 కోట్లకు పైగానే నష్టాలు..?
టాలీవుడ్ లోగో
  • Share this:
నెల రోజుల కింద కరోనా తెలంగాణకు వస్తుందా అంటే ఆ.. ఏమొస్తుందిలే అన్నారు. ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. అందులోనూ తెలంగాణకు రావడమేంటి అంటూ నవ్వుకున్నారు. కానీ గత వారం రోజుల్లోనే కరోనా చుక్కలు చూపిస్తుంది. దెబ్బకు అన్నీ బంద్ చేసి ఇంట్లో కూర్చునేలా చేసింది ఈ వైరస్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై కూడా ఈ వైరస్ ప్రభంజనంలా విరుచుకుపడుతుంది. దేన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇప్పటికే ఇండియాలో కరోనా మరణాలు కూడా పెరిగిపోతుండటంతో సినిమా షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. ఒక్కొక్కటిగా పెద్ద సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు.

నాని వి సినిమా (Nani V movie poster)
నాని వి సినిమా (Nani V movie poster)


నాని వి సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శర్వానంద్ శ్రీకారం, ఉప్పెన, నిశ్శబ్ధం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలే వాయిదా పడ్డాయి. దాంతో ఇంకా చాలా సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిపేసారు. రోజురోజుకీ కరోనా కేసులు అధికం అవుతుండటంతో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరో నెల రోజుల వరకు కూడా షూటింగ్స్ మొదలయ్యేలా కనిపించడం లేదు. ఇంటి నుంచి కాలు కూడా బయటికి పెట్టొద్దని ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ ప్రభావం టాలీవుడ్‌పై దారుణంగా పడుతుంది. ఇప్పటికే 1000 కోట్ల రూపాయలు నష్టపోయారని తెలుస్తుంది. అనుకోకుండా వచ్చిన ఈ కరోనా మహమ్మారితో చిన్న నిర్మాతలు రోడ్డున పడుతున్నారు.

coronavirus, karnataka, america, donald trump, health emergency, covid 19, అమెరికా, కరోనావైరస్, హెల్త్ ఎమర్జెన్సీ, డొనాల్డ్ ట్రంప్, కొవిడ్ 19, కర్ణాటక, ఢిల్లీ,
ప్రతీకాత్మక చిత్రం
పెద్ద నిర్మాతలకు కూడా వడ్డీల రూపంలో కోట్ల నష్టం వస్తుంది. సినిమాలు విడుదలైన కాకపోయినా.. షూటింగ్స్ జరిగినా ఆగినా తీసుకొచ్చిన కోట్లకు వడ్డీలు అయితే కట్టాల్సిందే. ఈ వైరస్ కారణంగా రెగ్యులర్‌గా ఏదో పక్కూరికి వెళ్లొచ్చినట్లు బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలు తిరిగేసి వచ్చే మన స్టార్స్ కూడా అంతా ఇంట్లోనే ఉన్నారు. ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. పర్సనల్ టూర్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని అనుకోకుండా వచ్చిన సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా కూడా కరోనా వైరస్ ఇప్పుడు కనికరం లేకుండా అందరిపై దాడి చేస్తుంది. మరి దీని ముగింపు ఎక్కడుందో ఏమో..? కచ్చితంగా మరో రెండు మూడు నెలల వరకు కూడా ఈ కరోనా ప్రభావం తప్పకపోవచ్చు.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు