Home /News /movies /

CORONA POSITIVE TO HERO SURYA HE REQUESTS PEOPLE TO BE CAUTIOUS MHN

Hero Surya - Covid Positive: హీరో సూర్యకు కరోనా పాజిటివ్

హీరో సూర్యకు కరోనా పాజిటివ్

హీరో సూర్యకు కరోనా పాజిటివ్

Hero Surya - Covid Positive: తమిళ ప్రేక్ష‌కుల‌తోపాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న‌కు కోవిడ్ పాజిటివ్ అని ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయ్యింది. ఈ విషయాన్ని హీరో సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

ఇంకా చదవండి ...
    తమిళ ప్రేక్ష‌కుల‌తోపాటు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న‌కు కోవిడ్ పాజిటివ్ అని ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయ్యింది. ఈ విషయాన్ని హీరో సూర్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ‘‘నేను కరోనాతో బాధపడుతున్నాను. తర్వగానే కోలుకుంటున్నాు. జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదని మనమందరం గ్రహిస్తాం . భయంతో స్తంభించలేరు. అదే సమయంలో భద్రత మరియు శ్రద్ధ అవసరం. అంకితమైన సహాయక వైద్యులకు ప్రేమ మరియు ధన్యవాదాలు’’ అని తెలియజేస్తూ హీరో సూర్య ట్వీట్ చేశారు. తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా ఆయన సూచించారు.

    సినిమాల విషయానికి వస్తే సూర్య ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తన 40వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రీసెంట్‌గా లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్స్, ఇతర పనులపై బయటకు వచ్చినప్పుడు సూర్యకు కోవిడ్ సోకి ఉండవచ్చుని భావిస్తున్నారు.



    గత ఏడాది ఓటీటీలో విడుదలైన ఆకాశం నీ హద్దురా(శూరరై పోట్రు) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు సూర్య. ఈ ఏడాది మన దేశం తరపున ఆస్కార్‌కు ఎన్నికైన చిత్రాల లిస్టులో ఇది కూడా ఉంది. సుధాకొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
    Published by:Anil
    First published:

    Tags: Corona Possitive, Covid-19, Kollyood News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు