జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కరోనా కష్టాలు.. పార్టిసిపెంట్స్ పారితోషకాల్లో భారీ కోత..

ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తాజాగా ఈ ఎఫెక్ట్ జబర్ధస్త్ ప్రోగ్రామ్ పై పడింది. దీంతో మల్లెమాల టీమ్ జబర్ధస్త్ పార్టిసిపేట్స్ పారితోషకం తగ్గించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమచారం.

news18-telugu
Updated: May 21, 2020, 9:48 AM IST
జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కు కరోనా కష్టాలు.. పార్టిసిపెంట్స్ పారితోషకాల్లో భారీ కోత..
ప్రతీకాత్మక చిత్రం (Image:ETV)
  • Share this:
ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అన్ని సినిమాలకు షూటింగ్స్‌కు సంబంధించిన షూటింగ్స్ కాన్సిల్ చేసింది. దీంతో సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమను నమ్ముకున్న చాలా మంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే కొద్ది మంది నటులు కూడా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో కార్మికులను ఆదుకోవడం కోసం కరోనా క్రైసిస్ ఛారిటీ ఏర్పాటు చేసారు. ఇవి కొంత మంది మాత్రమే చేరుతున్నాయి. అందరికీ ఈ సాయం చేరడం లేదు. ఇక  కరోనా ఎఫెక్ట్ జబర్ధస్త్ షో పై పడింది. తాజాగా కరోనా ఎఫెక్ట్ కారణంగా జబర్ధస్త్ షో పార్టిసిపేట్స్ పారితోషకం తగ్గించాలనే నిర్ణయానికి మల్లెమాల వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా జబర్ధస్త్ షో షూటింగ్స్ జరగడం లేదు. అంతేకాదు షూటింగ్స్ లేని కారణంగా ఆఫీస్ మెయింటెన్స్ కూడా భారంగా మారింది. వారందరికీ జీతాలు కూడా ఇవ్వాలి. ఇవి మల్లెమాల టీమ్‌కు తలకు మించిన భారంలా మారింది. ఒకవేళ  ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇస్తే.. త్వరలో జబర్ధస్త్ ప్రోగ్రామ్‌ను పట్టాలెక్కించడానికి తమ టీమ్ మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఒకవేళ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత అంతా మాములు అయ్యాక.. జబర్ధస్త్ పార్టిసిపేంట్స్‌కు  ఎప్పటిలాగే రెమ్యూనరేషన్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తానికి కరోనా కారణంగా జబర్ధస్త్ షోలో పార్టిసిపేట్స్‌కు మాములు ప్రజల్లాగే కొత్త కష్టాలు మొదలయ్యానే చెప్పాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 21, 2020, 9:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading