ఇంట్లో పేలిన కుక్కర్... తృటిలో తప్పించుకున్న టీవీ నటి

Mani Megalai : గ్యాస్ లీకవడం, గ్యాస్ బండ పేలడం వంటివి వింటుంటాం, చూస్తుంటాం... మరి ఈ కుక్కర్ పేలడమేంటి... పేలితే ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: February 21, 2020, 9:59 AM IST
ఇంట్లో పేలిన కుక్కర్... తృటిలో తప్పించుకున్న టీవీ నటి
టీవీ నటి ఇంట్లో పేలిన కుక్కర్ (credit - insta - iammanimegalai)
  • Share this:
Mani Megalai Cooker Blast : నిజమే ఆ ఇంట్లో కుక్కర్ పేలింది. ఇది జరిగింది తమిళనాడులోని అన్నానగర్‌లో. అక్కడ టీవీ నటి మణిమేఘలై తన ఇంట్లో జరిగిన ఓ ఘటనకు షాకైంది. ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఆమె ఎవరో చూద్దాం. సూపర్ హిట్ అనే టీవీ ప్రోగ్రాం చేసి మంచి పేరు తెచ్చుకుంది మణిమేఘలై. అలా అందర్నీ ఆకర్షించిన ఆమె... మాస్టర్ హుసైన్‌ని ప్రేమలో పడేసింది. మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు. సరే అంది. 2017లో ఆ పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత కాస్త అవకాశాలు తగ్గినా... మళ్లీ ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చేసింది. ఐతే... కొన్ని వర్క్స్ వల్ల ఆమె పెళ్లి తర్వాత ఒంటరిగా ఉంటోంది. ఇంట్లో వంటా ఇతరత్రా పనులు చెయ్యడానికి ఓ పనిమనిషిని పెట్టుకుంది. తాజాగా ఆ పనిమనిషి రాలేదు. అక్కడే సమస్య వచ్చింది.
ప్రతిసారీ బయటి తిండి తినడం ఆరోగ్యానికి మంచిది కాదనుకున్న మణిమేఘలై... మహిళనైన నేను వంటెందుకు చెయ్యకూడదు... అనుకుంటూ... అన్నం వండుకుందామని... కుక్కర్‌లో రైస్ వేసి స్టవ్‌పై పెట్టింది. అన్నం ఉడికేవరకూ అక్కడే ఉండాల్సిన పని లేదు కదా... విజిల్ వచ్చినప్పుడు వద్దాంలే అనుకొని... వేరే గదిలోకి వెళ్లి... వేరే పనులు చేసుకోసాగింది. కాసేపటికి విజిల్ రాలేదు. పెద్దగా బాంబు పేలిన సౌండ్ వచ్చింది. ఆశ్చర్యపోయిన మణిమేఘలై... ఏంటంత పెద్ద సౌండ్ వచ్చింది అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లింది. షాకైంది. ఉడికీ ఉడకని అన్నం... కిచెన్ మొత్తం పడి ఉంది. కుక్కర్ మూత ఒకచోట... కుక్కర్ మరోచోట పడి ఉన్నాయి. ఈ పేలుడు ధ్వనికి స్టవ్‌పై మంట ఆరిపోయి... గ్యాస్ లీకవుతోంది.వెంటనే గ్యాస్ ఆఫ్ చేసిన మణిమేఘలై... ఆ తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో తీసిన వీడియోను... తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెట్టింది. చూశారా... ఆమె కుక్కర్ మూతను సరిగా బిగించకపోవడం వల్ల ఎంత పనైందో. అదృష్టం కొద్దీ ఆ గదిలో లేదు గానీ... ఉండి ఉంటే... ఏమైనా జరిగేదే. ఇలా మన ఇళ్లలోనూ జరగొచ్చు. జాగ్రత్త పడాలంటోంది మణిమేఘలై.
Published by: Krishna Kumar N
First published: February 21, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading