Home /News /movies /

CONTROVERSY QUEEN SRI REDDY APOLOGIZES CHIRANJEEVI MOTHER ANJANAMMA FOR HER BAD WORDS TOWARDS HER PK

Sri Reddy - Chiranjeevi: బుద్ది గడ్డితిని చిరంజీవి అమ్మగారిని తిట్టాను క్షమించండి.. శ్రీ రెడ్డి వీడియో..

చిరంజీవి తల్లిని క్షమాపణ కోరిన శ్రీ రెడ్డి (chiranjeevi sri reddy)

చిరంజీవి తల్లిని క్షమాపణ కోరిన శ్రీ రెడ్డి (chiranjeevi sri reddy)

Sri Reddy - Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి (Sri Reddy - Chiranjeevi) పేరు తెలియని వాళ్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. పెద్ద నటి కాదు.. పెద్ద యాంకర్ కాదు.. కాకపోతే పెద్ద కాంట్రవర్సీ క్వీన్. అందుకే ఈమె అందరికీ తెలుసు. హీరోయిన్ల కంటే ఎక్కువగా పాపులర్ అయిపోయింది శ్రీ రెడ్డి.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి పేరు తెలియని వాళ్లు ఉండరేమో అంటే అతిశయోక్తి కాదు. పెద్ద నటి కాదు.. పెద్ద యాంకర్ కాదు.. కాకపోతే పెద్ద కాంట్రవర్సీ క్వీన్. అందుకే ఈమె అందరికీ తెలుసు. హీరోయిన్ల కంటే ఎక్కువగా పాపులర్ అయిపోయింది శ్రీ రెడ్డి. ఈమె చేసిన కొన్ని పనులు సంచలనానికి దారి తీసాయి. ముఖ్యంగా టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ విషయంతోనే ఈమె ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అప్పట్లో అర్ధ నగ్నంగా ఫిల్మ్ ఛాంబర్ ముందు కూర్చోవడం.. ఆ తర్వాత ఇష్టమొచ్చినట్లు పెద్ద వాళ్లను తిట్టడం.. ఆ వెంటనే సురేష్ బాబు తమ్ముడు అభిరామ్ ఇష్యూ.. అన్నీ శ్రీ రెడ్డిని సెలబ్రిటీగా మార్చేసాయి. పవన్ కళ్యాణ్‌ను కూడా అమ్మనా బూతులు తిట్టి అనవసరంగా బుక్ అయిపోయింది ఈ కాంట్రవర్సీ క్వీన్.

తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ప్రతీసారి చేసినట్లు బూతులతో కాదు.. ఈసారి బుద్దిగా ఉండే వీడియో చేసింది శ్రీ రెడ్డి. అప్పట్లో ఈమె చిరంజీవి తల్లి అంజనా దేవిని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ నానా యాగీ చేసింది. పవన్ కళ్యాణ్‌ను కూడా మధ్యలోకి తీసుకొచ్చి ఎంతో రచ్చ చేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై పవన్ కూడా చాలా సీరియస్ అయ్యాడు. తనను ఎంతన్నా పట్టించుకోని ఈయన అమ్మను అనేసరికి బయటికి వచ్చి విషయం పెద్దది చేసాడు. అప్పుడు తాను మాటలకు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేసింది శ్రీ రెడ్డి.

Chiranjeevi Mutha Mestri sequel: ఆ దర్శకుడితో చిరంజీవి చేస్తున్న సినిమా ‘ముఠా మేస్త్రి’కి సీక్వెల్..?


అప్పట్లో ఓ పెద్ద మనిషి తనను బ్రెయిన్ వాష్ చేసి.. ఓ కారణం చెప్పి న్యాయం జరుగుతుందని తప్పు దోవ పట్టించాడని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. తనకు చిరంజీవి కుటుంబానికి మధ్య ఉన్న పర్సనల్ గొడవల్లోకి తనను లాగాడని.. ఆడవాళ్ల కోసం తాను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ ఇష్యూ తర్వాత తన సొంత వాళ్లే తనను విమర్శించారని.. బయట నుంచి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.


ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడను తిట్టడం ముమ్మాటికీ తప్పే అని ఒప్పుకుంది శ్రీ రెడ్డి. దానికి తాను శిక్ష కూడా అనుభవించానని.. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌‌తో పాటు ఎన్నో ఫోన్ కాల్స్ కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తాను ఇప్పటికీ బాధపడుతున్నట్లు తెలిపింది శ్రీ రెడ్డి. అన్యాయంగా ఓ అమ్మను తిట్టడం తప్పేనని.. ఒప్పుకుంటున్నానని.. తాను తప్పుచేశాను.. బుద్ది గడ్డి తిని అలా తిట్టానని చెప్పింది ఈమె. పెద్ద మనసు చేసుకొని తనను క్షమించండి అంటూ శ్రీ రెడ్డి వీడియో విడుదల చేసింది. ఉన్నట్లుండి శ్రీ రెడ్డి ఇలా మారిపోవడం అందరిలోనూ లేనిపోని అనుమానాలకు తావిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Chiranjeevi, Sri Reddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు