• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • CONTROVERSY OVER SAI PALLAVI SONG SARANGA DARIYA FOLK SONGS KOMALI CLAIMS RIGHTS SK

Saranga Dariya: సాయిపల్లవి 'సారంగ దరియా'పై వివాదం.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్

సాయి పల్లవి (Image:AdityaMusic)

Saranda Dariya song: సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సారంద దరియా పాట.. ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. సారంగ దరియా పాటపై సర్వ హక్కులూ తనకే ఉన్నాయని జానపద గాయని కోమలి వాదిస్తోంది. అసలు ఈ పాటను వెలుగులోకి తెచ్చింది తానేనని.. మొదట హెచ్ఎం టీవీ, ఆ తర్వాత టీ న్యూస్‌లో పాడానని గుర్తు చేసింది.

  • Share this:
    ఇటీవలే విడుదలైన 'లవ్ స్టోరీ' సినిమా పాట 'సారంగ దరియా' తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. కోట్లాది వ్యూస్‌తో యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఫిబ్రవరి 28న విడుదలయిన ఈ లిరికల్ సాంగ్‌ ఇప్పటి వరకు 2 కోట్ల 80 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. తెలుగు వారే కాదు తమిళ్, కన్నడ, మలయాళీలతోనూ స్టెప్పులేయిస్తోంది. అంతగా హిట్టయిన ఈ సాంగ్‌ను ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ రాశారు. ఐతే అసలు పాట జానపదం అయినప్పటికీ.. చరణాలు మాత్రం సినిమాకు తగ్గట్లు మార్చి కొత్తగా రాసుకున్నారు. ఆ పాటను మంగ్లీ పాడింది. సీహెచ్ పవన్ మ్యూజిక్ అందించగా.. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేశారు.

    ఐతే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ పాట.. ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. సారంగ దరియా పాటపై సర్వ హక్కులూ తనకే ఉన్నాయని జానపద గాయని కోమలి వాదిస్తోంది. అసలు ఈ పాటను వెలుగులోకి తెచ్చింది తానేనని.. మొదట హెచ్ఎం టీవీ, ఆ తర్వాత టీ న్యూస్‌లో పాడానని గుర్తు చేసింది. ఎంతో కష్టపడి ఆ పాటను సేకరించినట్లు వెల్లడించింది. చిన్నతనంలో తన అమ్మమ్మ పాడుతుండగా విని.. రాసుకున్నానని పేర్కొంది కోమలి. తన వల్లే ఈ ప్రపంచానికి సారంగ దరియా పాట గురించి తెలిసిందని చెప్పింది. ఐతే రేలరే రేలా ప్రోగ్రాంలో జడ్జిగా ఉన్న సుద్దాల అశోక్ తేజ.. ఈ పాటను విని ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాకు వాడుకున్నారని వాపోయింది కోమలి.

    లవ్ స్టోరీ సినిమాలో తనతో పాడించనందుకు ఎంతో బాధేసిందని కన్నీళ్లు పెట్టుకుంది. ''పాట ప్రోమో బయటకు వచ్చాక నేనే సుద్దాల అశోక్ తేజకు కాల్ చేశాను. ఆయనతో పాటు శేఖర్ కమ్ముల నాతో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు నువ్వు పాడతామంటే ఒకే అని చెప్పారు. కానీ ఉన్నపళంగా పాడాలంటే నాకు వీలుకాదని చెప్పాను. మంగ్లీతో పాడించారు. ఆమె బాగా పాడలేదు. నేను పాడితేనే బాగుండేదని చాలా మంది అంటున్నారు. అసలు ఆ పాటలో నా పేరు ఎందుకు వేయలేదు. ఈ పాటను ప్రపంచానికి పరిచయం చేసిన నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదు. నేను దీని గురించి అశోక్ తేజ సర్‌ని అడిగితే.. నువ్వు ఈ పాట రాయలేదు కదమ్మా.. జానపదాన్ని ఎవరైనా తీసుకోవచ్చని చెప్పారు. మరి ఆయన పేరు ఎందుకు వేసుకున్నారు. సారంగ దరియా పాటపై సర్వ హక్కులు నాకే ఉన్నాయి.'' అని కోమలి వాపోయింది.

    కోమలి ఆరోపణలపై సుద్దాల అశోక్ తేజ గానీ, శేఖర్ కమ్ముల గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా, నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 16న లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: