హోమ్ /వార్తలు /సినిమా /

Varasudu: టాలీవుడ్ Vs కోలీవుడ్.. వారసుడు మూవీపై రచ్చ.. అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Varasudu: టాలీవుడ్ Vs కోలీవుడ్.. వారసుడు మూవీపై రచ్చ.. అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వారసుడు మూవీ

వారసుడు మూవీ

Varasudu Movie: సంక్రాంతికి వారసుడు సినిమాతో పాటు చిరంజీవి వాల్తేరు  వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాాలు కూడా విడదలవుతున్నాయి. ఐతే దిల్ రాజు.. వారసుడు కోసం.. పెద్ద మొత్తంలో థియేటర్లు బ్లాక్ చేయడంతో.. వీరి సినిమాలకు కూడా థియేటర్ల దొరకలేని పరిస్థితి నెలకొందట.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టాలీవుడ్ (Tollywood), కోలీవుడ్ (Kollywood) మధ్య వారసుడు మూవీ చిచ్చుపెట్టింది.  ఈ సినిమా గురించి తెలుగు సినీ పరిశ్రమ, తమిళ సినీ పరిశ్రమ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.  వారసుడు (Varasudu) సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు ప్రకటించడమే.. ఈ వివాదానికి కారణం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju).. తమిళ దళపతి విజయ్‌తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. వంశీపైడి పల్లి దర్శకత్వం వహిస్తున్నారు.  విజయ్ సరసన.. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. ఐతే సంక్రాంతికి (Sankranti) ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున సినిమా థియేటర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

Galodu Day 1 Collections: వసూళ్ళలో కింగ్ ఈ గాలోడు.. ఇది అంచనాలను మించిన కుమ్ముడు!

సంక్రాంతికి వారసుడు సినిమాతో పాటు చిరంజీవి వాల్తేరు  వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాాలు కూడా విడుదలవుతున్నాయి. ఐతే దిల్ రాజు.. వారసుడు కోసం.. పెద్ద మొత్తంలో థియేటర్లు బ్లాక్ చేయడంతో.. వీరి సినిమాలకు కూడా థియేటర్ల దొరకలేని పరిస్థితి నెలకొందట. ఈ క్రమంలో వారసుడు సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఐతే వారసుడు సినిమా.. డబ్బింగ్ చిత్రం కాదని.. ద్విభాషా చిత్రమని ఆ సినిమా యూనిట్ చెబుతోంది. అంతేకాదు విజయ్ మాత్రమే తమిళ నటుడు అని.. దర్శక నిర్మాతలు తెలుగువారేనని పేర్కొంది. అందువల్ల దీనిని తమిళ చిత్రంగా పరిగణించకూడదని తెలిపింది.

Anchor Ariyana: హోటల్ రూములో అరియానా.. బిగ్ బాస్ బ్యూటీ రొమాంటిక్ యాంగిల్స్‌

ఈ వ్యవహారం తెలుగు నిర్మాతల మండలి కలగజేసుకుంది. సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేయడంతో.. వివాదం రాజుకుంది. తెలుగు నిర్మాతల మండలిపై కోలీవుడ్ చిత్రసీమ మండిపడుతోంది. తమిళనాడులో తెలుగు సినిమాలు ఎలాంటి ఆటంకం లేకుండా విడుదలవుతున్నాయిని.. అలాంటప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తమిళ సినిమాలను ఎలా అడ్డుకుంటారని తమిళ దర్శక నిర్మాతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వారసుడు సినిమాను అడ్డుకుంటే.. తమిళనాడులో టాలీవుడ్ చిత్రాలను కూడా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

వారసుడు సినిమా వివాదంపై టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ స్పందించారు. సినిమాలను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. ఇది సాధ్యం కాదని స్పష్టం చేశారు. సినిమాకు ఎల్లలు లేవని.. సౌత్, నార్త్ అనే భేదాలను తొలగించామని అన్నారు. సినిమా బాగుంటే ఎక్కడైనా ఆడుతుందని పేర్కొన్నారు. ఐతే ఈ వివాదంపై నిర్మాత దిల్ రాజు మాత్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. మరి చెప్పినట్లుగానే.. వారసుడు మూవీ సంక్రాంతికి విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

First published:

Tags: Allu aravind, Tollywood, Varasudu Movie

ఉత్తమ కథలు