సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ పై వివాదం.. ఆ సీన్లు తొలిగించాలని హిందూ జాగృతి సమితి ఆందోళన..

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దబంగ్ 3’. దబంగ్ సీక్వెల్స్‌లో వస్తోన్న మూడో చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ చిత్రంపై తాజాగా వివాదం రాజుకుంది. తాజాగా ఈ సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: December 19, 2019, 10:42 AM IST
సల్మాన్ ఖాన్ ‘దబంగ్ 3’ పై వివాదం.. ఆ సీన్లు తొలిగించాలని హిందూ జాగృతి సమితి ఆందోళన..
సల్మాన్ ఖాన్ దబంగ్ 3 పోస్టర్
  • Share this:
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దబంగ్ 3’. దబంగ్ సీక్వెల్స్‌లో వస్తోన్న మూడో చిత్రం. ఇప్పటికే మొదటి రెండు పార్టులు హిట్ కావడంతో ఈ చిత్రంపై బాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే చిలిపి పోలీస్ చుల్ బుల్ పాండేగా దబంగ్ సిరీస్‌లో సల్మాన్ చేసిన యాక్షన్ కామెడీకి ప్రేక్షకులు మరిచిపోలేదు. ఇపుడు దబంగ్ 3లో చిలిపి పోలీస్‌గా సల్మాన్ ఖాన్ అల్లరి చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. ఈ సినిమాను ప్రభుదేవా డైరెక్ట్ చేసాడు. ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ చిత్రంపై తాజాగా వివాదం రాజుకుంది. తాజాగా ఈ సినిమాపై హిందూ జాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలోని ఓ పాట, కొన్ని సీన్స్ సాధువులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించింది. వెంటనే ఆ సన్నివేశాలను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సెన్సార్ బోర్డ్‌తో పాటు మహారాష్ట్ర సర్కార్‌కు విజ్ఞప్తి చేసారు. ఒకవేళ ఆయా సన్నివేశాలను తొలగించకుంటే.. సినిమా ప్రదర్శన నిర్వహిస్తున్న థియేటర్స్ వద్ద నిరషన ప్రదర్శనలు నిర్వహిస్తామని  హెచ్చరించారు.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు