హోమ్ /వార్తలు /సినిమా /

Hero Vijay: విజయ్ సినిమా పేర్లపై వివాదం.. అన్నీ అదే భాషలో అంటూ?

Hero Vijay: విజయ్ సినిమా పేర్లపై వివాదం.. అన్నీ అదే భాషలో అంటూ?

Hero Vijay Beast

Hero Vijay Beast

Hero Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పరిచయం గురించి తమిళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా అందరికీ తెలిసిందే. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతో యాక్షన్ హీరోగా నిలిచాడు.

Hero Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పరిచయం గురించి తమిళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా అందరికీ తెలిసిందే. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతో యాక్షన్ హీరోగా నిలిచాడు. దీంతో వరుసగా సినిమాలలో నటించి స్టార్ హీరో గా నిలిచాడు. ఇక ఈయనకున్న అభిమానులు కూడా అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన సినిమా పేర్లపై కొన్ని దుమారాలు ఎదురవుతున్నాయి.

తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు విజయ్. ఇక ప్రస్తుతం ఆయన ఓ సినిమాలో నటిస్తుండగా.. ఈయన సినిమా టైటిల్స్ పై కొన్ని వివాదాలు ఎదురవుతున్నాయి. తన సినిమాలకు ఎక్కువగా ఇంగ్లీష్ టైటిల్స్ ను పెడుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన నటించిన సినిమాలలో బిగిల్, మాస్టర్ అనే టైటిల్స్ తో తెరకెక్కగా ఈ సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి. కానీ టైటిల్స్ పేర్లు మాత్రం కొంతవరకు దారి తీస్తున్నాయి.

ప్రస్తుతం దళపతి విజయ్ తన 65 వ సినిమాలో నటించనుండగా ఈ సినిమాకు 'బీస్ట్' అనే టైటిల్ పెట్టడంతో అందరూ ఈ టైటిల్ ను చూసి ప్రశ్నిస్తున్నారు. తమిళ టైటిల్స్ కి విజయ వ్యతిరేకమా అని తెగ మండిపడుతున్నారు. ఇప్పటికే ఇంగ్లీష్ టైటిల్ తో వచ్చిన సినిమాలన్నింటి గురించి రాజకీయ నేతలు, భాషా పండితులు విజయ్ పై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటివరకు తమిళ స్టార్ హీరో రజినీకాంత్ ఎన్నో సినిమాలలో నటించగా ఒక్క సినిమాకి కూడా ఆంగ్లం టైటిల్ ను పెట్టలేదని అంటున్నారు. అలాంటిది విజయ్ ఎలా ఆంగ్ల పదాలను అంగీకరిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. తమిళ సినిమాలలో ఆంగ్ల పేరు రావద్దని మండిపడుతున్నారు. ఇప్పటికే తమిళంలో ఇలా సినిమాల విషయంలో ఎన్నో విమర్శలు ఎదురైనా సంగతి తెలిసిందే. అంతేకాకుండా వాటిని పెద్దగా చేసి బాగా రచ్చ చేస్తుంటారు తమిళులు. మరి ఈ సినిమా టైటిల్ గురించి ఈ విధంగా మండిపడటంతో విజయ్ తన సినిమా టైటిల్ ను మారుస్తాడా లేదా చూడాలి.

First published:

Tags: Beast, Hero vijay, Master, Tupaki

ఉత్తమ కథలు