అదేంటి.. సమంత ఆత్మ నటించడం ఏంటి అనుకుంటున్నారా..? అవును నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా నిజంగానే సమంత (Samantha Akkineni) ఆత్మ ఇప్పుడు అఖిల్ (Akhil) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor) సినిమాలో నటిస్తుంది. ఇన్ని రోజులు కనిపించకుండానే తెరవెనక ఉండిపోయిన సమంత ఆత్మ.. తొలిసారి తెరపైకి రాబోతుంది. అది కూడా అఖిల్ సినిమా కోసం. ఇంతకీ ఆ ఆత్మ ఎవరో తెలుసా.. సింగర్ చిన్మయి. ఈ రోజు సమంత ఇంత పెద్ద హీరోయిన్ అయిందంటే దానికి కారణం చిన్మయి వాయిస్ కూడా. ఆమె స్వరం లేకుండా సమంతకు ఈ రేంజ్ స్టార్ డమ్ వచ్చుండేది కాదు. ఇదే విషయం చాలాసార్లు సమంత కూడా మీడియా ముందే చెప్పుకొచ్చింది. తను శరీరం అయితే.. చిన్మయి తనకు ఆత్మ అంటూ చెప్పింది సమంత. ఇప్పుడు ఆ ఆత్మే అఖిల్ సినిమాలో నటించబోతుంది.
పాటల కంటే కూడా ఎక్కువగా కాంట్రవర్సీలతోనే కాపురం చేసే చిన్మయి (Chinmayi Sripada).. అఖిల్ (Akhil Akkineni) కోసం తొలిసారి మేకప్ వేసుకుంటుంది. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌పై ఆసక్తి బాగానే ఉంది. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తాజాగా ఈ సినిమాలో సింగర్ చిన్మయి ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై కనిపిస్తున్నారు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) చెప్పిన కథ నచ్చడంతో చిన్మయి తెర ముందుకు వస్తున్నారు. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ఇక ఇదే సినిమాలో చిన్మయి భర్త.. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil Akkineni, Akkineni samantha, Chinmayi Sripada, Telugu Cinema, Tollywood