వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే సోషల్ మీడియా స్టార్ శ్రీరెడ్డి. గెటప్ మార్చేసింది. తాజాగా ఓ గుడికి వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఎప్పుడూ హాట్ గ్యాలరీలు, సంచలన ట్వీట్లను మాత్రమే ట్వీట్ చేసే ఈ భామ ఇప్పుడు ఇలా ఆధ్యాత్మిక అవతారం ఎత్తేటప్పటికీ ఆమె ఫ్యాన్స్ నివ్వెరపోతున్నారు. అంతేకాదు తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో తీసుకోవాల్సిన మెళకువలను సైతం శ్రీరెడ్డి ఉచిత సలహాల రూపంలో ఇచ్చేస్తోంది. ముఖ్యంగా ఏపీలో కరెంటు కష్టాలపై శ్రీరెడ్డి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనదైన స్టైల్ లో సలహాలు ఇచ్చింది. అలాగే శ్రీరెడ్డి జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని కితాబునిచ్చింది. దీంతో ఈ భామ రాజకీయ అవగాహనకు ఆమె ఫాలోయర్లు ఆశ్చర్యపోతున్నారు.
ఇదిలా ఉంటే శ్రీరెడ్డి అటు సినిమా రంగంపై కూడా తన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాపై ప్రశంసల జల్లు కురిపిసతూ ట్వీట్లు చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ తో హారర్ సినిమా తీయాలంటూ తనదైన మార్కు పంచులు విసిరింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.