• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • CONTROVERSIAL ACTRESS SRI REDDY IN BIGG BOSS 5 SEE FULL DETAILS HERE MNJ

Bigg Boss 5- Sri Reddy: 'బిగ్ బాస్‌ 5' లో శ్రీరెడ్డి.. ఓకే చెప్పిన వివాదాస్ప‌ద న‌టి

Bigg Boss 5- Sri Reddy: 'బిగ్ బాస్‌ 5' లో శ్రీరెడ్డి.. ఓకే చెప్పిన వివాదాస్ప‌ద న‌టి

శ్రీ రెడ్డి (Sri Reddy/Twitter)

Bigg Boss 5- Srireddy: బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మొద‌ట్లో హిందీలో ప్ర‌సార‌మైన ఈ షో ఆ త‌రువాత ద‌క్షిణాదికి విస్త‌రించింది. ఈ క్ర‌మంలో క‌న్న‌డ‌లో ఈ షో ఎనిమిదో సీజ‌న్‌ని జ‌రుపుకుంటుండ‌గా.. తెలుగు, త‌మిళ్‌లో నాలుగు సీజ‌న్లు పూర్తి అయ్యాయి.

  • Share this:
    Bigg Boss 5- Srireddy: బుల్లితెర‌పై బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. మొద‌ట్లో హిందీలో ప్ర‌సార‌మైన ఈ షో ఆ త‌రువాత ద‌క్షిణాదికి విస్త‌రించింది. ఈ క్ర‌మంలో క‌న్న‌డ‌లో ఈ షో ఎనిమిదో సీజ‌న్‌ని జ‌రుపుకుంటుండ‌గా.. తెలుగు, త‌మిళ్‌లో నాలుగు సీజ‌న్లు పూర్తి అయ్యాయి. మ‌ల‌యాళంలో మూడో సీజ‌న్ ఇప్పుడు జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు, అటు త‌మిళ్‌లో ఐదో సీజ‌న్‌కి సంబంధించిన ఏర్పాట్లు మొద‌లైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు భాష‌ల్లో కంటెస్టెంట్ల కోసం ఇప్పుడు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు టాక్. అంతేకాదు కొంత‌మందితో సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు కూడా స‌మాచారం. ఈ క్ర‌మంలో ప్ర‌ముఖ వివాదాస్పద న‌టి శ్రీ రెడ్డిని బిగ్‌బాస్ కోసం సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. అయితే తెలుగు బిగ్‌బాస్ కోసం కాదు త‌మిళ్ బిగ్‌బాస్ కోసం.

    త‌మిళ్‌లో బిగ్‌బాస్‌కి క‌మ‌ల్ హాస‌న్ వ్యాఖ్య‌తగా చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే అక్క‌డ బిగ్‌బాస్ 5ను ప్రారంభించాల‌ని నిర్వాహ‌కులు అనుకుంటున్నారు.ఈ క్ర‌మంలో కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో శ్రీరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. టాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టించిన శ్రీరెడ్డి.. రోడ్డుపై అర్ధ‌నగ‌త్వాన్ని ప్రదర్శించి సంచ‌ల‌నంగా మారింది. అంతేకాదు స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా టాలీవుడ్‌లోని ప్ర‌ముఖుల‌పై ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డి వారు ఆమెను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై క‌న్నేసిన ఈ న‌టి.. అక్క‌డ‌కు వెళ్లింది.

    గ‌త రెండేళ్లుగా చెన్నైలో ఉంటోన్న ఈ న‌టిని బిగ్‌బాస్‌లోకి తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ అంటేనే కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్. అందుకే వివాదాస్ప‌ద న‌టుల‌ను తీసుకునేందుకు నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్ నిర్వాహ‌కులు శ్రీరెడ్డిని బిగ్‌బాస్ 5లోకి తీసుకోబోతున్న‌ట్లు టాక్. ప‌క్క భాష వారికి కూడా బిగ్‌బాస్‌లో చోటు ఇస్తూ ఉండ‌గా.. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌మిళ బిగ్‌బాస్‌లో శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వ‌బోతున్న‌ట్లు టాక్. మ‌రి ఇందులో నిజ‌మెంతె తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వారం ఆగాల్సిందే.
    Published by:Manjula S
    First published:

    అగ్ర కథనాలు