CONTROVERSIAL ACTRESS POONAM KAUR QUIT MOVIES AND HERE THE MAIN REASON BEHIND IT PK
పూనమ్ కౌర్ సినిమాలకు దూరం.. అసలు కారణం అదేనా..?
పూనమ్ కౌర్
కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా..
కొందరు హీరోయిన్లకు చేసిన సినిమాలు తక్కువగానే ఉంటాయి కానీ వచ్చిన క్రేజ్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ లిస్టులోకి వచ్చే హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ పవన్ కల్యాణ్ పుణ్యమా అని స్టార్ అయిపోయింది. ఆయనతో ఈమెకు సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ అప్పట్లో కొన్ని వార్తలు బాగానే వచ్చాయి. దానిపై పూనమ్ కూడా చాలా సీరియస్ అయిపోయింది. నిజానికి ఈమె సినిమాల కంటే కూడా ఈమె సోషల్ మీడియాలో చేసిన రచ్చే ఎక్కువ ఇమేజ్ తీసుకొచ్చింది. మధ్యలో కత్తి మహేష్ కూడా పూనమ్ కౌర్‌కు కావాల్సినంత గుర్తింపు తీసుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్,పూనమ్ కౌర్ (Facebook/photo)
అలా మొత్తంగా పవన్ కల్యాణ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా కూడా కేరాఫ్ పవన్ అయిపోయింది పూనమ్. ఇప్పటికీ పవన్ పేరు ఆయనపై చేసే కొన్ని కమెంట్స్ అభిమానులను కోపం నషాలానికి అంటేలా చేస్తాయి. మొన్నటికి మొన్న కూడా అబద్ధం ఆడేవాడు రాజకీయ నాయకుడు అవుతాడు కానీ నాయకుడు కాలేడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ మధ్య ఈమె అస్సలు సినిమాలు చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎందుకు సినిమాలు చేయట్లేదనే ప్రశ్న ఈమె దగ్గరికి వెళ్లింది.
పూనమ్ కౌర్ స్టిల్స్
తనకు అవకాశాలు వస్తున్నా కూడా కావాలనే చేయడం లేదని చెబుతుంది ఈ బ్యూటీ. దానికి కారణం కూడా లేకపోలేదు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. పిల్లల్ని కనాలని ఉందని.. తనకంటూ ఓ కుటుంబం కావాలనిపిస్తుందని అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పింది పూనమ్. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా మారిపోయింది పూనమ్ కౌర్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.