Bigg Boss 5 Telugu: ప్రస్తుతం బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 5 హవా మొదలయింది. షో మొదటి రోజు నుంచే హౌస్ లో రచ్చ ప్రారంభమైంది. మొత్తం 19 కంటెస్టెంట్ లతో పాల్గొన్న ఈ సీజన్ లో కాంట్రవర్సీలు, గొడవలు, ఎమోషనల్స్ అన్ని మొదటివారంలోనే జరుగుతున్నాయి. పైగా గ్రూపులుగా కూడా డివైడ్ అవుతూ గుసగుసలు కూడా మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో కంటెస్టెంట్ సెల్ఫ్ ఎలిమినేషన్ కానున్నట్లు తెలుస్తుంది.
మామూలుగా బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు గెలిచేదాకా పోరాడాలని గట్టిగా నిశ్చయించుకుంటారు. కానీ మధ్య మధ్యలో ఎలిమినేషన్ రౌండ్ లు ఉండటంతో మధ్యలోనే షో నుండి ఇంటి పట్టు పడతారు. మరికొందరు అందులో వాతావరణం తట్టుకోలేక సెల్ఫ్ ఎలిమినేషన్ కూడా అవుతుంటారు. గతంలో నటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈయన బిగ్ బాస్ లో ఇంటిలో ఉండలేకపోతున్నా అంటూ ఈ నియమాలు పాటించలేను అంటూ కోపం వ్యక్తం చేశాడు. ఇక బిగ్ బాస్ తో ఈ ఇంటి నియమాలను మార్చమని కోరగా బిగ్ బాస్ దానికి అంగీకరించలేదు. దీంతో సంపూర్ణేష్ బాబు బాగా ఎమోషనల్ అవుతూ ఇక్కడ ఉండలేను బిగ్ బాస్ అంటూ బాగా ఏడ్చాడు. వెంటనే పంపించండి అంటూ బిగ్ బాస్ ని వేడుకోగా బిగ్ బాస్ మొదట ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత సంపు బాధను చూడలేక ఒప్పుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన సెల్ఫ్ ఎలిమినేషన్ గా ఇంటి నుంచి బయటికి వెళ్లాడు.
ఇప్పుడు తాజాగా ప్రసారమవుతున్న సీజన్ 5 లో కూడా ఓ కంటెస్టెంట్ తీరు కూడా అలాగే కనిపిస్తుంది. ఆయన గతంలో బిగ్ బాస్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఈ షోను చూడను అంటూ కొన్ని విమర్శలు కూడా చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీజన్ 5 లో పాల్గొనగా మొదటి రెండు రోజులు బాగానే కనిపించాడు. కానీ తర్వాత రోజు నుండి ఈ షోలో ఉండటం కష్టము అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈయన కూడా సంపూర్ణేష్ బాబు లాగా సెల్ఫ్ నామినేషన్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akkineni nagarjuna, Bigg Boss 5 Telugu, Bigg boss lobo, Sampoornesh babu, Star Maa