Rhea Chakraborty: రియా చక్రబర్తికి మద్దుతుగా బెంగాల్‌ కాంగ్రెస్ భారీ ర్యాలీ..

Sushant Singh Rajput Rhea Chakraborty | బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు చాలా కోణాల్లో తిరుగుతుంది. ఈయన అనుమానాస్పద మృతి ఇప్పుడు చాలా కోణాల్లో అన్వేషిస్తున్నారు పోలీసులు. తాజాగా ఈ కేసులో పోలీసులు రియా చక్రబర్తిని అరెస్ట్ చేయడంపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ బెంగాల్ కాంగ్రెస్ శ్రేణులు కోల్‌కతాలో భారీ ర్యాలీని నిర్వహించాయి.

news18-telugu
Updated: September 13, 2020, 9:23 AM IST
Rhea Chakraborty: రియా చక్రబర్తికి మద్దుతుగా బెంగాల్‌ కాంగ్రెస్ భారీ ర్యాలీ..
రియా చక్రబర్తికి మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ (Twitter/Photo)
  • Share this:
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు చాలా కోణాల్లో తిరుగుతుంది. ఈయన అనుమానాస్పద మృతి ఇప్పుడు చాలా కోణాల్లో అన్వేషిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో భాగంగానే డ్రగ్స్ విషయాలు కూడా బయటికి రావడం సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలోనే రియా చక్రవర్తి సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కేసు విచారణలో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా బెంగాల్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా బెంగాల్‌లోని విక్టిమిసమ్‌కు వ్యతిరేకంగా శనివారం 300 మంది  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోల్‌కతా లోని వెల్లింగ్‌టన్ రోడ్‌లో  భారీ ర్యాలీని నిర్వహించారు.

రియా చక్రబర్తి (Twitter/Photo)


ఈ సందర్భంగా బెంగాల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మనో చక్రబర్తి మాట్లాడుతూ.. ఎందుకు నార్కోటిక్స్ డిపార్టెమెంట్ సుశాంత్ సింగ్ చనిపోయిన ఇన్ని రోజులకు రియాను అరెస్ట్ చేసింది. బిహార్ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే బీజేపీ రియా చక్రబర్తి అరెస్ట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు లోక్‌సభలో కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. సుశాంత్‌కు న్యాయం జరగాలని బిహార్ బీజేపీ నేతలు పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేయడంపై ఆయన   ఆగ్రహం వ్యక్తం చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ అమ్మాయి అని, ఆమె తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని, ఆయన దేశానికి సేవ చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి పిల్లలకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కావాలనే ఈ కేసులో రాజకీయ లబ్ది కోసమే ఇరికించారని ఆరోపించారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రబర్తి (File/Photo)


సుశాంత్ భారతీయ నటుడని అని, బిహార్ ఎలక్షన్స్‌లో లబ్ది పొందడానికే అతన్ని బిహారి నటుడిగా మార్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.  సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నందుకు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గానీ రియా అరెస్ట్ కాలేదని.. ఆమెను మాదక ద్రవ్యాల కేసులో అధికారులు అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. రాజకీయ అధినేతలను సంతోషపెట్టడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని ఆరోపించారు. సుశాంత్ కేసులో నిజమైన హంతకుల కోసం చీకట్లో వెతుకులాట కొనసాగుతూనే ఉందని అన్నారు. సుశాంత్‌కు న్యాయం చేయడమనేది ఒక బిహారికి న్యాయం చేసినట్టు ఉండకూడదని పేర్కొన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రియా చక్రవర్తి (sushant singh rajput rhea chakraborty)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రియా చక్రవర్తి (sushant singh rajput rhea chakraborty)


సుశాంత్ కేసుకు సంబంధించి.. కొన్ని  మీడియా సంస్థలు అత్యుత్సాహం ప్రదర్శంచి తమదైన విచారణ చేపట్టడం... భారతీయ న్యాయ వ్యవస్థకు మంచిది కాదని అధీర్ రంజన్ చౌదరీ తెలిపారు. అందరికీ న్యాయం చేయడమనేది మన రాజ్యంగంలో ప్రాథమిక సిద్ధాంతమని చెప్పారు. కాగా, సుశాంత్ ఆత్మహత్య అనంతర పరిణామాలు రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్దానికి కూడా దారితీసింది. ప్రస్తుతం ఈ కేసుపై సీబీఐ విచారణ జరుపుతోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 13, 2020, 9:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading