హోమ్ /వార్తలు /సినిమా /

కాంగ్రెస్ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన సీనియర్ నటి ఖుష్బూ..

కాంగ్రెస్ కార్యకర్త చెంప చెల్లుమనిపించిన సీనియర్ నటి ఖుష్బూ..

కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ

కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ

కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ..పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించింది. బెంగళూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఖుష్బూ..తనతో అసహ్యంగా ప్రవర్తించిన పార్టీ కార్యకర్తను లాగీ పెట్టి కొట్టింది.

    ఎన్నికల వేళ రాజకీయ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎంతో ఓర్పుగా వ్యవహరించాల్సిన నాయకులు.. ఒక్కొసారి తోటి కార్యకర్తలపై చేయి చేసుకున్న ఘటనలు తరుచుగా ఎక్కడో అక్కడ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక  కార్యకర్తలు, అభిమానులపై చేయి చేసుకునే విషయంలో ఇపుడు సీనియర్ నటి ఖుష్బూ వార్తల్లో వ్యక్తిగా నిలిచింది . తాజాగా సీనియర్ నటి ఖుష్బూ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉంది. తాజాగా ఈ నటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక కార్యకర్తను చేయి చేసుకున్న సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


    ఇటీవలె ఖుష్బూ బెంగుళూరులో కాంగ్రెస్ అభ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గూమిగూడారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి  ఖుష్బూతో అసభ్యంగా ప్రవర్తించడంతో..సదరు వ్యక్తి చెంపను ఖుష్బూ  చెళ్లు మనిపించింది. కానీ సదరు వ్యక్తి మాత్రం ఖుష్బూ పట్ల ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నాడు. ఏమైనా కొంత మంది ప్రజలు గుంపుగా జమైనపుడు అందులో కొంత మంది పోకిరీలు మహిళలను ఇబ్బంది పెట్టే చర్యలు చేస్తున్నారు. దీంతో ఖుష్బూ చేసిన ప్రవర్తనకు చాలా మంది తప్పు పట్టడం లేదు. 


    First published:

    Tags: Bangalore Karnataka Lok Sabha Elections 2019, Karnataka Lok Sabha Elections 2019, Kollywood, Tamil Cinema, Tamil Nadu Lok Sabha Elections 2019

    ఉత్తమ కథలు