మరో వివాదంలో కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ.. ఈ సారి అయోధ్య విషయంలో..

మర్యాద పురుషోత్తముడు రాముడు పుట్టిన అయోధ్య రామ జన్మభూమిలో ఆ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజకు శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా కుష్బూ రామ మందిర శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

news18-telugu
Updated: August 5, 2020, 7:19 PM IST
మరో వివాదంలో కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ.. ఈ సారి అయోధ్య విషయంలో..
రామ మందిర శంకుస్థాపన వేళ కుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు (Twitter/Photo)
  • Share this:
మర్యాద పురుషోత్తముడు రాముడు పుట్టిన అయోధ్య రామ జన్మభూమిలో ఆ రోజు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజకు శంకుస్థాపన చేసారు. కోవిడ్ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులు ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడం జరిగింది. ఇలాంటి శుభ తరుణంలో బీజేపీ నేతలతో పాటు మోదీ అభిమానులు పోస్ట్‌లతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీనీ యుగపురుషుడు అని బీజేపీతో పాటు సాధారణ ప్రజలు కూడా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ నటులు కూడా అయోధ్యలో రామజన్మభూమి శంకుస్థాపన కార్యక్రమాన్ని స్వాగతించారు. ఎన్నాళ్లుగానోె భారతీయులు ఎదురు చూస్తున్న కల నెరేవరిందని పోస్ట్‌లు కూడా పెట్టారు.ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఎంపీ శోభ కరాంద్లాజే సోషల్ మీడియాలో బాల రాముడిని మోదీ అయోధ్య రామ మందిరానికి తీసుకెళుతున్నట్టుగా ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.


పతన ప్రియమైన రాజును ఇంటికి తిరిగి స్వాగతించడానికి అయోధ్య  సిద్దంగా ఉందంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌ను ప్రముఖ నటి కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ షేర్ చేశారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వావ్.. ఇపుడు దేవుడైనా రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యరన్నమాట.. కలియుగం మరీ అని భావం వచ్చేలా సెటైర్ వేశారు. ఇపుడీ ట్వీట్ పై బీజేపీ అభిమానులతో పాటు హిందూ సంఘాల వాళ్లు భగ్గు మంటున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 5, 2020, 7:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading