కాలేయ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్..?

1982లో అమితాబ్ బచ్చన్ కూలీ షూటింగ్ సినిమా సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో ఆయన కాలేయం 75శాతం వరకు దెబ్బతిన్నట్టు కథనాలు వచ్చాయి.

news18-telugu
Updated: October 18, 2019, 11:06 AM IST
కాలేయ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్..?
అమితాబ్ బచ్చన్ (File Photo)
news18-telugu
Updated: October 18, 2019, 11:06 AM IST
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (77)కాలేయ సంబంధిత వ్యాధితో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరినట్టు కథనాలు వస్తున్నాయి. అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి దాటాక 2గంటల సమయంలో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు పలు ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అదే సమయంలో మరికొన్ని మీడియా సంస్థలు మాత్రం బిగ్ బీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాయి.ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే నానావతి ఆస్పత్రికి వెళ్లారని.. అంతకుమించి మరేమీ లేదని తెలిపాయి.

కాగా, 1982లో అమితాబ్ బచ్చన్ కూలీ షూటింగ్ సినిమా సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పట్లో ఆయన కాలేయం 75శాతం వరకు దెబ్బతిన్నట్టు కథనాలు వచ్చాయి. అంతేకాదు, దాని కారణంగా హెపటైటిస్-బి కూడా సోకి దానికి చికిత్స తీసుకున్నారు. తాజాగా మళ్లీ కాలేయ సంబంధిత వ్యాధికి గురవడంతో ఆస్పత్రిలో చేరారని ప్రచారం జరుగుతోంది.

ముంబైకి చెందిన హిందీ మీడియా సంస్థ అమర్ ఉజాలా.. బచ్చన్ ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పింది. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ఏం సాక్ష్యం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, అమితాబ్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్ పతి' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రం 'గులాబు సితాబ్' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

First published: October 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...