Disha Case: దిశ రేప్ ఘటన.. సల్మాన్ ఖాన్, రకుల్, రవితేజపై కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

Disha Case

Disha Case: బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ పై తాజాగా కేసు నమోదు అయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ వ్యవహారం ఓ రేంజ్ లో

 • Share this:
  Disha Case: బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ నటులు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ పై తాజాగా కేసు నమోదు అయింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ వ్యవహారం ఓ రేంజ్ లో నడుస్తుంది. అంతలోనే వీరిపై మరో కేసు నమోదైంది. ఇంతకీ అసలు సంగతి ఏంటంటే..

  2019లో నవంబర్ 27న దేశం మొత్తం రగిలిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఓ నలుగురు దుండగులు ఓ అమ్మాయిని రేప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటన అందరికీ తెలిసిందే. ఇక ఈ ఘటనకు దిశ అని పేరు పెట్టి ఆ పేరుతోనే చర్చలు చేశారు. ఇటువంటి ఘటనలు ప్రపంచంలో చాలాచోట్ల జరగగా ఆ ఘటనలకు సంబంధించిన అసలైన పేర్లను వాడకుండా కొన్ని పేర్లతో వాటి గురించి చర్చలు చేస్తుంటారు. ముఖ్యంగా బాధితురాలి పేర్లను అసలు బయటకి చెప్పలేరు. ఒకవేళ అలా చెబితే వారిపై కేసు నమోదు అవుతుంది.

  ఇక అలాంటి కేసులోనే ఇరుక్కున్నారు ఈ నటులు. దిశ హత్యకు సంబంధించిన విషయంలో బాధితురాలి పేరును సోషల్ మీడియా వేదికగా బయటకు తెలిపారు సల్మాన్ ఖాన్, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్. అంతేకాకుండా వీరితోపాటు మరో 30 మందిపై కూడా ఈ కేసు నమోదయింది. అందులో అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గన్, అభిషేక్ బచ్చన్, ఫరాన్ అక్తర్, అనుపమ ఖేర్ తో పాటు టాలీవుడ్ నటులు అల్లు శిరీష్, ఛార్మిలపై కూడా కేసు నమోదు అయింది. ఇక వెంటనే వీరిని అరెస్టు చేయాలని పిలుపు వచ్చింది.

  దిల్లీ తీస్ హజారీ కోర్టులో వీరిని అరెస్టు చేయాలని న్యాయవాది గౌరవ్ గులాటి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాకుండా సబ్జీ మండీ పోలీస్ స్టేషన్ లో కూడా గౌరవ్ గులాటి సెక్షన్ 228ఏ కింద కూడా కేసు నమోదు చేశాడు. దీంతో పోలీసులు కూడా ఈ సెలబ్రేట్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
  Published by:Navya Reddy
  First published: