Acharya- Pushpa- RRR: ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్.. కామన్ పాయింట్ ఏంటో తెలుసా.. !

ఆచార్య పుష్ప ఆర్ఆర్ఆర్

Acharya- Pushpa- RRR: ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమాల విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఆచార్య‌, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట, రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప‌, వెంక‌టేష్ నార‌ప్ప‌, గోపిచంద్ సిటీ మార్ స‌హా ప‌లువురు హీరోల‌ చిత్రాలకు విడుద‌ల తేదీలు ఖ‌రార‌య్యాయి.

 • Share this:
  Acharya- Pushpa- RRR: క‌రోనా నేప‌థ్యంలో దాదాపుగా ఏడాది పాటు మూగబోయిన థియేట‌ర్ల‌లో మ‌ళ్లీ సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. లాక్‌డౌన్ స‌మయంలో ఓటీటీకి డిమాండ్ పెరిగిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మాత్రం ప్రేక్ష‌కులంద‌రూ థియేట‌ర్ల‌లో చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్ర‌మంలో సంక్రాంతి సందర్భంగా థియేట‌ర్ల‌లో విడుద‌లైన సినిమాల‌కు మంచి క‌లెక్ష‌న్లు కూడా వ‌చ్చాయి. ఇక సంక్రాంతి సినిమాలు ఇచ్చిన ఊపుతో ఇప్పుడు ద‌ర్శ‌క‌నిర్మాత‌లంద‌రూ మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమాల విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిరంజీవి ఆచార్య‌, మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట, రామ్ చ‌ర‌ణ్‌-ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ పుష్ప‌, వెంక‌టేష్ నార‌ప్ప‌, గోపిచంద్ సిటీ మార్ స‌హా ప‌లువురు హీరోల‌ చిత్రాలకు విడుద‌ల తేదీలు ఖ‌రార‌య్యాయి.

  కాగా వీట‌న్నింటిలో ఆచార్య, పుష్ప, ఆర్ఆర్ఆర్‌ల‌కు ఒక కామ‌న్ పాయింట్ ఉంది. అదేంటి అనుకుంటున్నారా.. ఈ మూడు సినిమాల విడుద‌ల నెల‌లు వేరైనా.. తేది మాత్రం ఒక‌టే కావ‌డం విశేషం. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ఆచార్య‌.. మే 13న రానుండ‌గా.. అల్లు అర్జున్- సుకుమార్ పుష్ప మూవీ ఆగ‌ష్టు 13న రానుంది. అలాగే రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ క్రేజీ మ‌ల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇలా మూడు భారీ చిత్రాలు నెల‌లు వేరైనా ఒకే తేదీన వ‌స్తున్నాయి.

  కాగా చిరంజీవి ఆచార్య సినిమాను కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో కాజల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. సోనూసూద్, అజ‌య్, హిమ‌జ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లో న‌టించ‌డంతో పాటు రెజీనా ప్ర‌త్యేక గీతంలో మెర‌వ‌నుంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకోవ‌డంతో పాటు చిరంజీవి లుక్ అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంది. ఇక ఈ టీజ‌ర్ తరువాత ఇటు మెగాభిమానుల్లో కాదు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలు పెరిగిపోయాయి.

  ఇక అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేష‌న్లో తెర‌కెక్కుతోన్న మూడో చిత్రం పుష్ప‌. టాలీవుడ్‌లోని క్రేజీ కాంబోలో వీరిద్ద‌రిది ఒక జోడీ కాగా.. ఈ మూవీ అనౌన్స్ చేసిన‌ప్పటి నుంచే అంచ‌నాలు పెరిగాయి. ఇక ఇటీవ‌ల విడుద‌లైన లుక్‌ల‌తో ఆ అంచ‌నాలు రెట్టింపయ్యాయి. ఇక ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్న న‌టించ‌నుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తంశెట్టి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

  ఇక బాహుబ‌లి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్- రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి ఇందులో మొద‌టిసారిగా న‌టిస్తున్నారు. ఈ మూవీ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచే దేశవ్యాప్తంగా అంచ‌నాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ చిత్రం నుంచి వ‌చ్చిన టీజ‌ర్లు అభిమానుల్లో మ‌రింత అంచ‌నాలను పెంచాయి. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్ష‌కులే కాదు యావ‌త్ సినీ ప్ర‌పంచం ఎదురుచూస్తోంది.
  Published by:Manjula S
  First published: