Singer Sunitha: పెళ్లి తరువాత రూటు మార్చనున్న సింగర్ సునీత.. త్వరలోనే నిర్ణయం

సింగర్ సునీత

Singer Sunitha: పెళ్లి తరువాత ఇలాంటి అంశాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని సునీత.. భర్తతో చర్చించిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • Share this:
    కొద్దిరోజుల క్రితం రెండో పెళ్లి చేసుకున్న సింగర్ సునీత.. ప్రస్తుతం భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్‌ను ఆస్వాదిస్తోంది. తన పిల్లలను కూడా సాధ్యమైనంత తొందరగా సెటిల్ చేయాలనే సునీత, ఆమె భర్త రామ్ ఉన్నారనే ప్రచారం కొద్దిరోజులుగా సాగుతోంది. అయితే తాజాగా సునీతకు బుల్లితెర నుంచి మంచి ఆఫర్ వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. గతంలో బుల్లితెరపై టెలికాస్ట్ అయిన పలు షోలకు జడ్జిగా వ్యవహరించిన సింగర్ సునీతను కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించాలని కొందరు కోరుతున్నట్టు సమాచారం. రెండో పెళ్లి తరువాత సింగర్ సునీత మరింత పాపులర్ అయ్యారు. ఆమె ఎంతో ధైర్యంగా తన లైఫ్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అనేకమంది సెలబ్రిటీలు సైతం ఆమెను అభినందించారు. నెటిజన్లలోనూ అనేక మంది ఆమె తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

    ఈ క్రమంలోనే సింగర్ సునీతకు ఓ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరించాలనే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. ఆమె ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇందుకోసం ఆమెకు భారీ రెమ్యూనరేషన్‌ ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే పెళ్లి తరువాత ఇలాంటి అంశాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని సునీత.. భర్తతో చర్చించిన తరువాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు సింగర్ సునీత కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తే.. ఆమె రోజాకు గట్టి పోటీ ఇస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి పెళ్లి తరువాత బుల్లితెరపై సింగర్ సునీత సరికొత్తగా కనిపిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published: