• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • COMEDIAN VENNELA KISHORE COMMENTS ON ANCHOR SUMA KANAKALA NEW VILLA READ FULL DEATILS HERE MNJ

Suma Kanakala: కొత్త విల్లాను కొన్న‌ సుమ‌.. లీక్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్

Instagram

Anchor Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. ప్రతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో సుమ‌ది ఒక ప్రోగ్రామ్ అయినా క‌చ్చితంగా ఉంటుంది.

  • Share this:
    Anchor Suma Kanakala: తెలుగు బుల్లితెర‌పై యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. యాంక‌రింగ్‌లో ఆమెను ఎవ్వ‌రూ దాట‌లేర‌న్న‌ది ప్రేక్ష‌కులు ఎరిగిన స‌త్యం. ప్రతి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో సుమ‌ది ఒక ప్రోగ్రామ్ అయినా క‌చ్చితంగా ఉంటుంది. న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. క్లీన్ ఇమేజ్‌తో ముందుకు వెళుతున్న సుమ‌పై కామెంట్లు చేయాల‌ని ఎవ్వ‌రికీ అనిపించదు. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. దేశ విదేశాల్లో కూడా సుమ అంటే క్రేజ్ ఉంది. వయసు 50కి చేరువ అవుతున్నా కూడా ఇప్పటికీ అదే స్టార్ డమ్ కంటిన్యూ చేస్తున్నారు ఈ యాంక‌ర్.

    ఈ క్ర‌మంలో సుమ రెమ్యున‌రేష‌న్ ఎంత అన్న ప్ర‌శ్న అంద‌రిలో మెదులుతూ ఉంటుంది. అయితే ఆమె ఎంత సంపాయిస్తుంది అన్న దాన్ని ప‌క్క‌న‌పెడితే మిగిలిన అంద‌రి యాంక‌ర్ల కంటే సుమ‌నే ఎక్కువ సంపాయిస్తుంద‌ని అంద‌రూ భావిస్తుంటారు. ఇదిలా ఉంటే సుమ రెమ్యున‌రేష‌న్‌పై ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా కామెంట్లు చేసిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే సుమ‌పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ వెన్నెల కిశోర్ కామెంట్లు చేశారు.

    వెన్నెల కిశోర్ ఫైల్ ఫొటో


    ఆదివారం నితిన్, కీర్తి సురేష్‌లు న‌టించిన రంగ్‌దే మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్యక్ర‌మంలో వెన్నెల కిశోర్ మాట్లాడారు. చివ‌ర‌గా వెళుతూ వెళుతూ.. ససుమ గారు మీరు విల్లా కొన్నార‌ట క‌దా. దానికి టైల్స్ ప‌ని జ‌రుగుతుంద‌ట క‌దా అని వెన్నెల కిశోర్ అన్నాడు. ఆ మాట‌ల‌కు సుమ షాక్‌గా.. ఎక్క‌డా. ఎవ‌రు చెప్పారంటూ స‌మాధానం ఇచ్చింది. కాగా సినిమాల్లోనే కాదు బ‌య‌ట కూడా ఫ‌న్నీగా ఉండే వెన్నెల కిశోర్.. అదే విధంగా సుమ‌పై కామెంట్లు చేసిన‌ట్లు తెలుస్తోంది.
    Published by:Manjula S
    First published: