హోమ్ /వార్తలు /సినిమా /

సునీల్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను..?

సునీల్‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను..?

బోయపాటి సునీల్ (Boyapati Sunil)

బోయపాటి సునీల్ (Boyapati Sunil)

Sunil: హీరోగా సక్సెస్ కరువైపోవడంతో రెండేళ్లుగా మళ్లీ కమెడియన్ అయిపోయాడు సునీల్. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఈయన కెరీర్ మలుపు తిప్పే పాత్ర మాత్రం ఇప్పటి వరకు పడలేదు.

హీరోగా సక్సెస్ కరువైపోవడంతో రెండేళ్లుగా మళ్లీ కమెడియన్ అయిపోయాడు సునీల్. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఈయన కెరీర్ మలుపు తిప్పే పాత్ర మాత్రం ఇప్పటి వరకు పడలేదు. త్రివిక్రమ్ సినిమాలు చేసినా కూడా ముందు కామెడీ కనిపించడం లేదు. దాంతో సునీల్ కెరీర్ ప్రస్తుతం డల్‌గా సాగుతుంది. దానికితోడు డిస్కో రాజా లాంటి సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు సునీల్. అయినా కూడా బ్రేక్ రాలేదు. ప్రస్తుతం కలర్ ఫోటో సినిమాలో పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఈ కమెడియన్ కమ్ హీరో. ఇలాంటి సమయంలో సునీల్‌కు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది.. అదే బోయపాటి, బాలయ్య సినిమా.

సునీల్ బాలయ్య (balakrishna sunil)
సునీల్ బాలయ్య (balakrishna sunil)

ఈ చిత్రంలో ముందు విలన్‌గా నటిస్తున్నాడనే వార్తలు వచ్చినా కూడా అది తప్పు.. కమెడియన్‌గానే నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కారెక్టర్ కూడా ఎగిరిపోయిందని ప్రచారం జరుగుతుంది. దానికి కారణం క్వారంటైన్.. అదేంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. లాక్‌డౌన్‌కు ముందుగానే ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులు జరిగింది. అయితే అనుకోకుండా బ్రేక్ రావడంతో స్క్రిప్ట్ మరోసారి చూసుకున్నాడు బోయపాటి. ఎప్పటికప్పుడు మార్పులు చేయడానికి యిష్టపడే బోయపాటి.. ఆ మార్పుల్లో భాగంగానే సునీల్ కామెడీ ట్రాక్ మొత్తం ఎత్తేసాడని తెలుస్తుంది.

సునీల్ బాలయ్య (balakrishna sunil)
సునీల్ బాలయ్య (balakrishna sunil)

సినిమాలో సునీల్ ట్రాక్ లేకపోయినా కూడా కథలో పెద్దగా మార్పులు కనిపించకపోవడంతో ఈ సీక్వెన్స్ అంతా తీసేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో మంచి పాత్ర పడుతుందనుకుంటే అదిరిపోయే షాక్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. సునీల్ ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాలో నటించబోతున్నాడు. దాంతో పాటు మరికొన్ని సినిమాలున్నా కూడా కెరీర్ టర్న్ అయ్యే ఆఫర్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాడు భీమవరం బుల్లోడు. మరి అది ఎప్పుడొస్తుందో చూడాలి.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Sunil, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు