నాకేం కాలేదు.. డిస్కో రాజా ఎంజాయ్ చేయండంటున్న సునీల్..

కమెడియన్ సునీల్ హాస్పిటల్ పాలయ్యాడనే వార్త ఇండస్ట్రీలో అందరికీ షాక్ ఇచ్చింది. అభిమానులు అయితే అసలు సునీల్‌కు ఏమైంది అంటూ చాలా కంగారు పడిపోయారు. దానికి తోడు తీవ్ర అస్వస్తత అంటూ కొన్ని..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 23, 2020, 8:35 PM IST
నాకేం కాలేదు.. డిస్కో రాజా ఎంజాయ్ చేయండంటున్న సునీల్..
కమెడియన్ సునీల్ ఫైల్ ఫోటో
  • Share this:
కమెడియన్ సునీల్ హాస్పిటల్ పాలయ్యాడనే వార్త ఇండస్ట్రీలో అందరికీ షాక్ ఇచ్చింది. అభిమానులు అయితే అసలు సునీల్‌కు ఏమైంది అంటూ చాలా కంగారు పడిపోయారు. దానికి తోడు తీవ్ర అస్వస్తత అంటూ కొన్ని మీడియాలు కూడా రాయడంతో ఫ్యాన్స్ నిజంగానే కంగారు పడ్డారు. కానీ మెల్లమెల్లగా సునీల్ ఆరోగ్యం గురించి అన్ని విషయాలు బయటికి వచ్చాయి. ఈయన కొన్ని రోజులుగా లివర్‌కు సంబంధించిన అతి చిన్న సమస్యతో బాధ పడుతున్నాడు. దానికితోడు వైరస్ కూడా రావడంతో జ్వరం వచ్చేసింది. దాంతో వైద్యుల సూచన మేరకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సునీల్ ఆరోగ్యంపై ఎవరికి తోచినట్లు వాళ్లు రాసేసారు.

దాంతో కాస్త గందరగోళం కూడా అయిపోయింది. వెంటనే సునీల్ లైన్‌లోకి వచ్చేసి.. తనకు ఏం కాలేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇచ్చిన క్లారిటీ సరిపోలేదేమో మరి అందుకే తాజాగా మరో పోస్ట్ కూడా పెట్టాడు సునీల్. నా గురించి ఇంతగా ఆలోచించిన నా శ్రేయోభిలాషులందరికీ థ్యాంక్స్.. నేను ఇప్పుడు బాగానే ఉన్నాను.. ఏం కంగారు లేదంటూ ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు. దాంతోపాటు డిస్కో రాజా థియేటర్స్‌లోకి వస్తుంది ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు భీమవరం బుల్లోడు. ఈ చిత్రంలో రవితేజతో పాటు నటించాడు సునీల్. మొత్తానికి తనకేం కాలేదని.. అనవసరంగా లేనిపోనివి చెప్పి అభిమానులను కంగారు పెట్టొద్దని కోరాడు సునీల్.
Published by: Praveen Kumar Vadla
First published: January 23, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading