హోమ్ /వార్తలు /సినిమా /

Comedian Sunil: కమెడియన్ సునీల్ చేతుల మీదుగా చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ రిలీజ్

Comedian Sunil: కమెడియన్ సునీల్ చేతుల మీదుగా చెడ్డి గ్యాంగ్ తమాషా టీజర్ రిలీజ్

Cheddy Gang Tamasha News 18

Cheddy Gang Tamasha News 18

Cheddy Gang Tamasha Teaser: మరికొద్ది రోజుల్లో చెడ్డి గ్యాంగ్ తమాషా అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా టైటిల్ లుక్, టీజర్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల మద్దతు లభిస్తుండటం చూస్తున్నాం. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వైవిధ్యభరితమైన కథలు వెండితెరపై రాణిస్తున్నాయి. అదే బాటలో ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ తమాషా (Cheddy Gang Tamasha) అనే మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ తాజాగా టైటిల్ లుక్, టీజర్ రిలీజ్ (Cheddy Gang Tamasha Teaser) చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు.

అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తుండగా.. ఆయన సరసన గాయత్రి పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ నల్లగొప్పుల సంగీతం అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కథకు సూట్ అయ్యే లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ చేశారు. షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ షురూ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టిజర్ ను ప్రముఖ నటుడు సునీల్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ''అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా శ్రీ క్రాంతి కిరణ్ గారి నిర్మాణంలో వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా తెరకెక్కిన చెడ్డీగ్యాంగ్ తమాషా. చిత్రాన్ని ప్రేక్షకులు థియేటర్స్ లో చూసి కొత్తవాళ్ళని ఎంకరేజ్ చేయాలని.. చేస్తారని కోరుకుంటున్నా'' అన్నారు.

నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. సునీల్ గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ టైటిల్ టిజర్ రిలీజ్ కావడం చాలా హ్యాపీ గా ఉందని చెప్పారు. ఈ చెడ్డీగ్యాంగ్ తమాషా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయని త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Comedian Sunil, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు