Home /News /movies /

COMEDIAN SRINIVAS REDDY REVEALS THE ACCIDENT WHICH HAPPENED JR NTR AND HE EXPLAINS ITS CONSEQUENCES SR

ఆ ఒక్క ఘటన తారక్ నుండి నన్ను దూరం చేసింది : శ్రీనివాసరెడ్డి

జూనియర్ ఎన్టీఆర్ Photo: Twitter

జూనియర్ ఎన్టీఆర్ Photo: Twitter

జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్‌కు ఇచ్చే వాల్యూనే వేరు రాజీవ్ కనకాల, రాఘవ, సమీర్, రఘు ఇలా చాలామంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ వున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ లిస్టులో నటుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉండేవాడు.

ఇంకా చదవండి ...
    జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్‌కు ఇచ్చే వాల్యూనే వేరు రాజీవ్ కనకాల, రాఘవ, సమీర్, రఘు ఇలా చాలామంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి బాండింగ్ వున్న సంగతి తెలిసిందే. అయితే ఒకప్పుడు ఈ లిస్టులో నటుడు, కమెడియన్ శ్రీనివాసరెడ్డి కూడా ఉండేవాడు. కానీ ఓ సంఘటన ఆ తర్వాత ఇద్దరిమధ్య స్నేహం చెడింది. దీంతో శ్రీనివాస్ రెడ్డికి ఎన్టీఆర్ సినిమాలలో కమెడియన్‌గా చాన్సులు కూడా రావడంలేదు. అయితే ఈ విషయంపై శ్రీనివాస్ రెడ్డి రీసెంట్‌గా  ఓ యూట్యూబ్ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో తన వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం కావడానికి కారణాలు చాలానేవున్నాయి. నేను వేరే సినిమాలు చేస్తుండడం, నాకు పెళ్ళికావడం, నాకు ఎన్టీఆర్ సినిమాలో వచ్చిన రోల్‌కు ఇంపార్టెన్స్ లేకపోవడం..దానికి తోడు ముఖ్యంగా ఎన్టీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా ఓ కారణం అంటూ వివరించాడు. ఒకప్పుడు నాకు ఎన్టీఆర్‌తో మంచి రిలేషన్ ఉండేదని, ఆయన ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొనేవాడిని, అందులో భాగంగా ఒకసారి నేను ఖమ్మం సభకు హాజరుఅయ్యాను. ఆ సభ మంచి సక్సెస్ అయింది, ఎక్కువ మంది జనాలు కూడా హాజరయ్యారు. ఆ సభకు అయితే అవి పండగ రోజులు కావడంతో అక్కడినుంచి ఇంటికి చేరుకోవాలనుకున్నాం, తారక్ నన్ను కారు ఎక్కు అన్నారు కానీ నా బ్యాగ్ తెచ్చుకునే లోపే మరొకరు ఆ ప్లేసులో కూర్చున్నారు. నేను వేరే కారులో బయలుదేరా. అయితే కొంత దూరం వెళ్లాక తారక్ కార్‌కు యాక్సిడెంట్ అయ్యింది దిగి చుస్తే తారక్ గాయాలతో రక్తం కారుతూ కనిపించారు. వెంటనే నేను ప్రయాణిస్తున్న కారులో తారక్‌కు ఎక్కించుకొని, సూర్యాపేటలో ఉంటున్న మా అక్కను సంప్రదించి దగ్గరలోని హాస్పిటల్‌లో ప్రాథమిక చికిత్స చేయించి గాయాలకు కుట్లు వేయించి, కిమ్స్ హాస్పటల్‌కు తీసుకువెళ్లాం.

    దర్శకుడు అనిల్ రావిపూడితో  శ్రీనివాసరెడ్డి Photo: twitter.com/Actorysr


    అయితే.. ఆ సమయంలో ఓ వ్యక్తి ‘నువ్ అడుగుపెట్టావ్.. తారక్‌కి యాక్సిడెంట్ అయ్యింది’ అన్నాడు. నాకు ఒక రకమైన షేక్ వచ్చి" నేను ఉండబట్టే తారక్ ప్రాణాలతో వచ్చాడు.. లేకపోతే ఏమయ్యేదో" అని అన్నా. ఆ సమయంలో నాకొచ్చిన కోపం అలాంటిది. బహుశా ఆమాటే మాఇద్దరి మధ్య గ్యాప్ తీసుకొచ్చింది అనుకుంటున్నా. అయితే ఈ విషయాన్ని తారక్ దగ్గర నేను అన్నదానికి మరికొంత యాడ్ చేసి..ఆయనకు చెప్పి ఉండొచ్చు. ఆ ఇన్సీడెంట్ తరువాత తారక్‌ను ఓ సారి కలిసినా అంతకముందు వున్న రిలేషన్ షిప్‌ను నేను ఆయనతో ఫీల్ అవ్వలేదు. అయితే ఈ విషయాన్ని తారక్‌తో ప్రస్తావించకపోవడం నాతప్పే. ఈసారి కలిసినప్పుడు తారక్‌తో క్లియర్ చేసుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు శ్రీనివాసరెడ్డి.
    First published:

    Tags: Jr ntr, Srinivas reddy, Telugu Cinema, Telugu Movie, Telugu Movie News, Tollywood, Tollywood Cinema, Tollywood Movie News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు