Srinivas Reddy Plan B movie: సెప్టెంబర్ 17 న విడుదలవుతున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ' ప్లాన్ బి'..

శ్రీనివాస్ రెడ్డి ప్లాన్ బి సినిమా (Plan B movie)

Srinivas Reddy Plan B movie: కమెడియన్లు ఇదివరకు చాలా మంది హీరోలుగా మారారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు.. తాజాగా మరో కమెడియన్ హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. ఆయనెవరో కాదు శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy Plan B movie). ఇప్పుడు ప్లాన్ బి అంటూ వచ్చేస్తున్నాడు ఈయన.

  • Share this:
కమెడియన్లు ఇదివరకు చాలా మంది హీరోలుగా మారారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు.. మరికొందరు ఫ్లాప్ అయ్యారు. అయినా కూడా ఇప్పటికీ కమెడియన్ హీరోగా నటిస్తున్నాడంటే మాత్రం ఆ సినిమాపై ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. తాజాగా మరో కమెడియన్ హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. ఆయనెవరో కాదు శ్రీనివాస్ రెడ్డి. తాజాగా ఈయన నటిస్తున్న ప్లాన్ బి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న చిత్రం "ప్లాన్-బి". థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఎంతో థ్రిల్ కి గురయ్యే విధంగా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్స్ కి, టీజర్ , ట్రైలర్ కి మంచి స్పందన రాగ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠభరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది.

అయన కూడా ఈ సినిమా టీజర్ ఎంతో క్యూరియాసిటీగా ఉంది.. సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నారు.. ఇక టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని, అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుంది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published: