COMEDIAN SAPTHAGIRI ROLE IN PRABHAS SALAAR MOVIE SLB
Prabhas: సలార్ సినిమాలో తెలుగు కమెడియన్.. ప్రశాంత్ నీల్ డిఫరెంట్ ప్లాన్!
Photo Twitter
Prabhas Salaar: క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందిస్తున్న సలార్ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes) చూడబోతున్నామట. ఈ క్రమంలోనే తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఇటీవలే రాధే శ్యామ్ సినిమాతో భారీ డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన.. ఏ మాత్రం డిజప్పాయింట్ కాకుండా తన తదుపరి సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాహుబలి (Bahubali) సినిమాతో తెలుగోడి సత్తా ఎల్లలు దాటించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్తుతం వరుసపెట్టి బిగ్గెస్ట్ సినిమాల్లో భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ మూవీ సలార్ (Salaar) శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రూపొందిస్తున్న ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ (Action Episodes) చూడబోతున్నామట. ఈ క్రమంలోనే తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్ డేట్ బయటకొచ్చింది.
కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కామెడీ కూడా ఉండేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారట. ఇందుకోసం టాలీవుడ్ కమెడియన్ సప్తగిరితో ఓ స్పెషల్ రోల్ చేపిస్తున్నారట. ప్రస్తుతం ఆయన సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చారట సప్తగిరి. దీన్నిబట్టి చూస్తే ఈ సలార్ సినిమాలో సప్తగిరి ఫుల్ లెంత్ రోల్ లో చూడొచ్చని అర్థమవుతోంది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ రేంజ్‌కి తగ్గట్లుగా హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తికాగా.. చిత్ర క్లైమాక్స్ చాలా డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేశారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. క్లైమాక్స్‌లో వచ్చే ఈ సన్నివేశాలు ప్రభాస్ కెరీర్లోనే ది బెస్ట్ సీన్స్ అవుతాయని టాక్.
ఈ భారీ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. జగపతి బాబు, మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ (Prithwiraj sukumaran), ఈశ్వరీరావు (Eeswari Rao) కీలక పత్రాలు పోషిస్తుండగా రవి బస్రూర్ (Ravi Basrur) బాణీలు కడుతున్నారు. ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబో కావడంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు కొదవే ఉండదని ఫిక్సయ్యారు ఆడియన్స్. ఈ సినిమాపై రెబల్ స్టార్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.