జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు. కాస్తంత మనస్సుకు రిలాక్స్ గా ఉండటానికి చాలామంది యూ ట్యూబ్ లో ఈ కామెడీ షోని చూస్తుంటారు. దీనిలో ఎక్కువగా హైపర్ ఆది తన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఒక్కో సమయంలో అతడి పంచులే కాంట్రవర్సీలకు అడ్డాగా కూడా మారుతాయి. వాటిలో భాగంగానే హైపర్ ఆది ఓ హీరో అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆది అంటే ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా గుర్తుకు వస్తుంది. అందులో యంగ్ టైగర్ నందమూరి తారకరామారవు చెప్పే డైలాగ్స్ వింటే అభిమానులకు పూనకం వస్తుంది. అంతలా అతడి కెరీర్ లో మైలురాయిగా మిగిలిపోయింది ఆ సినిమా.
హైపర్ ఆది అంటే మాత్రం జబర్దస్త్ కామెడీ షోలో తన పంచులతో బుల్లితెర పేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆది గుర్తుకు వస్తాడు. అతి తక్కువ కాలంలోనే ఎక్కువ ఫేమ్ తెచ్చున్నాడు ఈ ఆది. ఏ ప్రోగ్రాంకి వెళ్లినా తన పంచులతో పటాసులు పేల్చినట్లు నవ్విస్తాడు. అయితే అతడు ఈ మధ్య వేసిన పంచులు ఓ హీరోని కించపరిచినట్లు ఉండటంతో అభిమానులు ఆది కోసం వెతుకులాడటం మొదలు పెట్టారు.
ఆది కనిపిస్తే.. మీద పడి దాడి చేసేంత కోపంతో ఉన్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల దీపావళి సందర్భంగా ఒక ప్రముఖ ఛానెల్ లో జరిగిన ఫెస్టివల్ ఈవెంట్ లో టాలీవుడ్ కి చెందిన ఒక హీరోని ఇమిటేట్ చేస్తూ పంచ్ డైలాగులతో కామెడీ చేశాడు. కామెడీకి అందరూ బాగానే నవ్వుకున్నారు. కానీ తర్వాత అతడికి కష్టాలు మొదలయ్యాయి.
నవ్వులు పోయి..నువ్వులు అయ్యాయి అనే సామెత ఉంటుంది. అచ్చం అలానే అతడికి ఆ కామెడీ తలనొప్పిని తెచ్చిపెట్టింది. సినీ పరిశ్రమలో ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఆ హీరోపై ఆది వేసిన పంచులకు గానూ.. ఆ హీరో అభిమానులు హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆది ఎక్కడున్నాడో అని వెతుకులాడటం కూడా మొదలు పెట్టేశారు.
దీంతో చేసేది లేక ఆది ఎవరికీ కనిపించకుండా షూటింగ్ లకు వెళ్లలేక.. ఇటు ఇంట్లో ఉండలేక చివరికి తన సొంత వాహనంలో కూడా తిరగలేక గత రెండు, మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. హైపర్ ఆదికి ఇలా జరగడం మొదటి సారి కాదు. అంతక ముందు కూడా అతడు వేసే పంచుల వల్ల కొంతమంది ఇబ్బందులు పడ్డారు. తర్వాత అతడు క్షమాపణలు కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జరిగిన ఈ ఘటనలో ఆది సదరు హీరోకి క్షమాపనలు చెబుతాడో.. లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.