హైపర్ ఆది బుల్లితెరపై కమెడియన్‌గా పాపులర్ అయ్యాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ బుల్లితెరపైకి దూసుకొచ్చిన హైపర్ ఆది.. జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి మామూలుగా ఉండదు. అయితే హైపర్ ఆది ఇప్పటికే పలు వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు. యాక్సిడెంట్ చేసినందుకు ఏకంగా షోలోనే ఆదిని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదల అయ్యింది. అయితే ఈ షో జరుగుతుండగానే... హైపర్ ఆదిని వచ్చి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రొమో హల్ చల్ చేస్తుంది.
రష్మి(Anchor Rashmi)) హోస్ట్ గా `శ్రీదేవి డ్రామా కంపెనీ`(Sridevi Drama Company Promo) కామెడీ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడంతో యాంకరింగ్ బాధ్యతలు రష్మి తీసుకుంది. ఇందులో రష్మి టార్గెట్‌గా పంచ్‌లు పేలుస్తున్నారు హైపర్ ఆది(Hyper Aadi). ఈ షోకి ఆయనే హైలైట్‌గా నిలుస్తున్నారు. ఆయన వేసే పంచ్‌లు, ఆయనపై వేసే పంచ్‌లు ఇప్పుడు ఆద్యంతం నవ్వులు పూయిస్తున్నాయి. సుధీర్ లేకపోవడంతో ఆది, రాంప్రసాద్ కలిసి స్కిట్లు చేస్తూ కామెడీని పంచుతున్నారు.
తాజాగా వచ్చే ఆదివారానికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో షాకిచ్చే విషయాలను బయటపెట్టారు నిర్వహకులు. హైపర్ ఆదిని అరెస్ట్ చేసేందుకు ఏకంగా స్టేజ్ పైకే పోలీసులు రావడం దుమారం రేపుతుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. షోలో భాగంగా హైపర్ ఆది ఓ అమ్మాయితో కలిసి డాన్సులు వేస్తున్నారు. డ్యూయెట్లు పాడుతూ షోకి జోస్ తీసుకొస్తున్నాడు. ఇంతలో షో జరుగుతున్న సెట్‌లోకి పోలీసులు వచ్చారు. ఆది ఎక్కడంటూ షో సిబ్బందిని కాదంటూ లోపలికి వచ్చేశారు పోలీసులు.
షోలో పోలీసులు రావడంతో.. అంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అంతేకాదు ఏకంగా స్టేజ్ ఎక్కేశారు పోలీసులు. ఇది చూసిన ఆది ఒక్కసారిగా షాక్ అయ్యారు. జడ్జ్ గా ఉన్న పూర్ణ, యాంకర్ రష్మి, వర్ష, ఇమ్మాన్యుయెల్, రాంప్రసాద్ ఇలా అందరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నువ్వు కారులో వస్తుంటే గుద్ది యాక్సిడెంట్ చేశావ్.ఆ వ్యక్తి ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆది అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిజంగానే ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారా ? లేదంటే.. ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనా అంటూ ఆడియన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Extra jabardasth, Hyper Aadi, Sridevi drama company, Sridevi Drama Company Latest Promo