హోమ్ /వార్తలు /సినిమా /

Bandla Ganesh:బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇస్తే.. ఫ్రస్టేషన్ వస్తుంది.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్

Bandla Ganesh:బండ్ల గణేష్ ఇంటర్వ్యూ ఇస్తే.. ఫ్రస్టేషన్ వస్తుంది.. కమెడియన్ షాకింగ్ కామెంట్స్

బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్ లీక్ (bandla ganesh)

బండ్ల గణేష్ కాల్ రికార్డింగ్ లీక్ (bandla ganesh)

బండ్ల గణే‌ష్ పై వరుసగా ఎక్స్ ప్రెస్ హరి పంచుల మీదే పంచులు వేశాడు. ఆయన ఇంటర్వ్యూలు ఇస్తే కాంట్రోవర్సీలు వస్తాయంటూ కీలక కామెంట్స్ చేశాడు.

బండ్ల గణేష్..(Bandla Ganesh). తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద నిర్మాత. నటుడిగా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు డై హార్డ్ ఫ్యాన్. పవన్ అంటే పిచ్చి. రాజకీయాల్లోకి బండ్ల ఎంట్రీ ఇచ్చినా.. అక్కడ సక్సెస్ కాలేకపోయారు. తిరిగి యూటర్న్ తీసుకొని సినిమాలపైనే దృష్టి పెట్టారు.ఈ క్రమంలోనే ఆయన ఓ టీవీ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరయ్యారు. మెగా బ్రదర్ జడ్జీగా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు.

జబర్దస్త్(Jabardasth) కార్యక్రమం తరహాలో స్టార్ మాలో కామెడీ స్టార్స్ (Comedy Stars) కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎక్స్ ప్రెస్ హరి .. బండ్ల గణేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బండ్ల గణేష్ నటించిన డేగల బాబ్జి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి జడ్జిగా వచ్చారు బండ్ల గణేష్.ఈ క్రమంలోనే ఎక్స్ ప్రెస్ హరి బండ్ల గణేష్ పై స్కిట్ చేసి అందర్నీ నవ్వించారు. ఈ క్రమంలోనే ఒక అమ్మాయితో కలిసి డాన్స్ చేస్తూ వచ్చిన ఎక్స్ ప్రెస్ హరి మాట్లాడుతూ.. పెళ్లయిన మగాడితో జీవితం బండ్ల గణేష్ గారు మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూ లాంటిది. ఎంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ ఇద్దామన్నా ఎక్కడో ఒకచోట ఫ్రస్టేషన్ వస్తుందంటూ బండ్లపై పంచ్ వేసాడు.

అదే విధంగా తన టీం మెంబర్ ఒకరు వచ్చి నాగబాబును డాడీ అనే ఉద్దేశిస్తూ…అన్న డాడీ పక్కన కూర్చున్న అతను ఎవరు అంటూ బండ్ల గణేష్ ని చూపిస్తూ అడుగుతారు. అతను బండ్ల గణేష్ సినిమా ప్రొడ్యూసర్. ఆయన సినిమాలు చేస్తే కలెక్షన్లు వస్తాయని ఎక్స్ ప్రెస్ హరి చెప్పగా వెంటనే మరొక వ్యక్తి ఇంటర్వ్యూలు ఇస్తే అని అడగగా వెంటనే ఎక్స్ ప్రెస్ హరి కాంట్రవర్సీలు వస్తాయి అంటూ బండ్ల గణేష్ గురించి మరోసారి పంచ్ వేసి అందరిని నవ్వించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

' isDesktop="true" id="1316942" youtubeid="mkc3Suw8xL8" category="movies">

ఇక వీళ్లు వేసిన పంచ్‌లకు బండ్ల గణేస్ నవ్వుతూ ఎంజాయ్ చేశాడు. ఇక ఇంతలో మరో వ్యక్తి వచ్చి.. స్కిట్ లో భాగంగా... ఇంటి రెంట్ కట్టాలి.. పదిహేను వేలు మాత్రమే ఉన్నాయి. మరో ఐదువేలు కావాలి.అంటే.. వెంటనే ఎక్స్ ప్రెస్ హరి.. ఐదువేలు ఇచ్చి సాయం చేస్తాడు. దీనికి అవతల వ్యక్తి  మీకు ఇంత మంచితనం ఎలా వచ్చింది సార్ అంటాడు.. దానికి ఎక్స్ ప్రెస్ హరి బదులిస్తూ.. బేసిక్‌గా నేను బండ్ల గణేష్ అభిమాని..మాకు న్యాయం అయినా సాయం అయినా చేసేస్తాం అంతే అంటూ డైలాగ్స్ వేస్తాడు. దానికి బండ్ల గణేష్ చప్పట్లు కొడతాడు.

First published:

Tags: Bandla Ganesh, Comedy stars, Producer bandla ganesh, Star Maa

ఉత్తమ కథలు