• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • COMEDIAN BHARTI SINGHS HUSBAND HARSH LIMBACHIYA HAS ALSO BEEN ARRESTED NARCOTICS CONTROL BUREAU IN MUMBAI SK

Bharti Singh Arrest: డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నటి అరెస్ట్

Bharti Singh Arrest: డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నటి అరెస్ట్

భారతి సింగ్

Bharti Singh Arrest: శనివారం కమెడియన్ భారతి సింగ్ నివాసంతో పాటు ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఈ రెండు చోట్ల 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాము గంజాయి తీసుకున్నామన్న విషయాన్ని భార్యాభర్తలు అంగీకరించారు.

  • Share this:
    బాలీవుడ్ చిత్రసీమలో డ్రగ్స్ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. డ్రగ్స్ తీసుకుంటున్నాయన్న ఆరోపణలతో ప్రముఖ కమెడియన్ భారతి సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్ట్ చేశారు. భారతితో పాటు భర్త హర్ష్ లిబచియాను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. శనివారం కమెడియన్ భారతి సింగ్ నివాసంతో పాటు ప్రొడక్షన్ హౌస్‌లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఈ రెండు చోట్ల 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాము గంజాయి తీసుకున్నామన్న విషయాన్ని భార్యాభర్తలు అంగీకరించారు. నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో ఇరువురినీ అరెస్ట్ చేశారు.


    శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు చేశారు. విచారణ అనంతరం భారతిని అరెస్ట్ చేయడం.. బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

    సుశాంతత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత.. బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై ఎన్సీబీ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై పలు చోట్ల సోదాలు జరిపి.. ప్రముఖ నటీ నటులను ఈ కేసులో విచారించారు. గతవారం నటుడు అర్జున్ రాంపాల్, ఆయన పార్టనర్ గాబ్రియేలా డెమిట్రియాడెస్‌ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు రెండుసార్లు ప్రశ్నించారు. ఇక బాలీవుడ్ నిర్మాత ఫెరోజ్ ఎ.నడియాడ్‌వాలా భార్యను అరెస్టు చేశారు. టీవీ జంట సనమ్ జోహర్, అబిజైల్ పాండేల ఇళ్లలోనూ సోదాలు చేశారు.

    అక్టోబరులో లోనావాలోని ఓ రిసార్ట్‌లో సౌతాఫ్రికాకు చెందిన అజిసిలోస్‌ను అరెస్ట్ చేశారు. కాబోయే భార్యతో కలిసి రిసార్ట్‌లో ఉన్న సమయంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేసి 0.8 గ్రాముల చరాస్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, భారతి సింగ్ ఇటీవల కపిల్ శర్మ షోలో కనిపించారు. లల్లీ అనే కమెడియన్ పాత్రను ఆమె పోషించారు. ప్రస్తుతం ఆమె తన భర్త హర్ష్ లిబచియాతో కలిసి .. సోని టీవీలో ప్రసారమయ్యే ఇండియాస్ బెస్ట్ డాన్సర్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఝలక్ థిఖ్లా జా, నాచ్ బలియే వంటి పలు రియాల్టీ షోల్లోనూ ఆమె గతంలో సందడి చేశారు. 2017 డిసెంబర్ 3న హర్ష్ లిబచియాతో భారతికి వివాహం జరిగిన విషయం తెలిసిందే.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు